Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్
వ్యాక్సినేషన్‌పై కేంద్రం చెబుతోన్న వివరాలన్నీ అసత్యాలని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ అందిందని పేర్కొంది.
దేశంలో 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని తప్పుబట్టింది. తప్పుడు లెక్కలతో భాజపా ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకు మాత్రమే పూర్తి రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు చెబుతోంది.
గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు.
क्या ये महोत्सव का समय है:
— Congress (@INCIndia) October 22, 2021
- जब चीन में 80% लोगों को वैक्सीन लग चुकी थी?
- 18 से कम उम्र के बच्चों के वैक्सीनेशन प्रोग्राम की घोषणा नहीं हुई?
- पिछले दस दिन में वैक्सीनेशन की दर निरंतर घटी है?
: श्री @GouravVallabh#ModiHoshMeinAao pic.twitter.com/ieRfS8WxPO
పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేసి దాదాపు రూ.33 లక్షల కోట్లు ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. అందులో కేవలం 2 శాతం అంటే రూ.35 వేల కోట్లు మాత్రమే వ్యాక్సినేషన్‌కు ఖర్చు చేసినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపై కూడా మోదీ ఫొటో ఉండటాన్ని గౌరవ్ తప్పుబట్టారు.
Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ
Also Read: Overthinking Impact: అతిగా ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మ.. బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి!
Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి