Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !

పెట్రో రేట్లు తగ్గించమన్న వారిపై యూపీ బీజేపీ మంత్రి తివారీ మండి పడుతున్నారు. కార్లున్న వారికి మాత్రమే పెట్రోల్ అవసరం ఉంటుందని.. ఇంకెవరికి సంబంధం లేదని ఆయన అంటున్నారు.

FOLLOW US: 

దేశంలో 95శాతం మందికి పెట్రోల్ అవసరం లేదట. అవసరం లేకుండానే ప్రభుత్వం పన్నులను టన్నుల కొద్దీ పెంచేసినా కొనేసి బండ్లేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారట. ఈ విషయాన్ని ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ నేతలే చెబుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై ఎక్కిడికక్కడ ప్రజలు నిలదీస్తూంటే ఏం చెప్పాలో తెలియని బీజేపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. గతంలో పలువురు చేసిన వివాదాస్పద కామెంట్లకు కొనసాగింపుగా.. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఉపేంద్ర తివారి మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్‌ అవసరమే లేదని తేల్చేశారు.  కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్‌ ధరల గురించి ఆందోళన ఉందని చెప్పుకొచ్చారు. 

Also Read : '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

మంత్రి పదవులతో ప్రజల మీద సవారీ చేస్తున్న తివారీ అంతటితో ఆగలేదు.. పెట్రోల్ రేట్లు పెరిగితే ఏమీ కొనలేరా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మోడీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగిందని ఆ మాత్ర పెట్రోల్ కోసం ఖర్చు పెట్టలేరా అంటున్నారు. ఒక్క తివారీ మాత్రమే కాదు. పెట్రోల్ రేట్ల గురించి అడిగితే తిక్క సమాధానాలు చెప్పే వారు బీజేపీలో కోకొల్లలుగా ఉన్నారు. ఒకరేమో పెట్రోల్ రేట్లు పెరగడానికి తాలిబన్లు అంటారు. మరొకరు నెహ్రూ కారణం అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ నేతల ప్రకటనలు చాలా నవ్విస్తాయి. కానీ పెట్రోల్ కొనేవాళ్లకు మాత్రం మంట పుట్టిస్తాయి.  

Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'

ఓ వైపు ప్రతిపక్షాలు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్‌, 4 వీలర్‌ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది.  కానీ మంత్రికి ఈ విషయంలో పెద్దగా అవగాహన లేనట్లుగా ఉంది. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్‌ అవసరం ఉంటుందా.. బైకులు ఉన్న వారు నీళ్లతో నడుపుతరాా అని ప్రశ్నిస్తున్నారు.  

Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ నేతలు ఒకప్పుడు రూ. అరవై లీటర్ పెట్రోల్ ధర ఉంటేనే అర్థనగ్నంగా రోడ్లెక్కారు. తాము వస్తే ప్రభుత్వ దోపిడిని నిలుపుదల చేస్తమన్నారు. కానీ బీజేపీ వచ్చార.. పెట్రోల్ రేటు రెండింతలు అయింది. కానీ వారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కానీ ఎదురుదాడికి మాతరం దిగుతున్నారు.

Also Read : 'నీ కూతురికి ఎవరితోనో సంబంధం ఉంటే.. నువ్యు రేప్ చేసేస్తావా?'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Oct 2021 10:34 AM (IST) Tags: BJP petrol up bjp minister petrol rates Minster tiwari

సంబంధిత కథనాలు

Green Card: భారతీయులకు శుభవార్త-  ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Court Fine For CBI Ex Chief : ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం కోర్టుకెళ్తే రూ. పదివేల జరిమానా పడింది - రిటైర్డ్ తెలుగు ఐపీఎస్‌కు ఎంత కష్టమో !?

Court Fine For CBI Ex Chief :   ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం కోర్టుకెళ్తే రూ. పదివేల జరిమానా పడింది - రిటైర్డ్ తెలుగు ఐపీఎస్‌కు ఎంత కష్టమో !?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు

World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు