Kerala High Court: 'నీ కూతురికి ఎవరితోనో సంబంధం ఉంటే.. నువ్యు రేప్ చేసేస్తావా?'
సొంత కూతుర్నే అత్యాచారం చేసిన ఓ తండ్రి కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితురాలికి అంతకుముందు ఏమైనా సంబంధాలున్నా దోషిని శిక్షించే సమయంలో అవి న్యాయస్థానం పరిగణించదని వ్యాఖ్యానించింది. తన 16 ఏళ్ళ కూతురిపై తరుచుగా అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రి కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కీలక వ్యాఖ్యలు..
ఏం జరిగింది?
కేరళలోని ఓ వ్యక్తి తన సొంత కూతురిపై తరుచుగా అత్యాచారం చేసి చివరకి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీనికి కారణం తన తండ్రేనని ఆ బాలిక అమ్మకు చెప్పింది. తర్వాత బంధువుల సాయంతో పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అయితే కోర్టులో ఆ బాలిక తండ్రి చేసిన ఆరోపణలను విని న్యాయమూర్తులే షాకయ్యారు. తన కూతురికి ఇంతకంటే ముందే చాలా మందితో లైంగిక సంబంధం ఉందని ఆ తండ్రి కోర్టులో వాదించాడు. ఈ వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపాడాల్సిన స్థానంలో ఉండి ఇలాంటి నీచమైన పని చేయడం మొదటి తప్పని.. మళ్లీ ఆ తప్పుని ఇలా అసత్యాలతో వెనకేసుకురావడం మరో తప్పని కోర్టు చివాట్లు పెట్టింది.
డీఎన్ఏ ఆధారంగా తన కూతురి గర్భానికి తండ్రే కారణమని తేలడంతో నిందితుడ్ని దోషిగా కోర్టు గుర్తించింది. కొన్ని సందర్భాల్లో భయంతోనో, కుటుంబ గౌరవం గురించో ఆలోచించి ఇలాంటి అత్యాచార విషయాలు కోర్టుల వరకు రావడం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కాస్త ఆలస్యం అయినా కోర్టు వాటిని తప్పుగా పరిగణించడం లేదని అభిప్రాయపడింది.
Also Read: SRK Meets Aryan Khan: ముంబయి జైలుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్!
Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి