Afghan News : " మేకింగ్ తాలిబన్ గ్రేట్ ఎగైన్ !" ... ఇప్పుడు అమెరికాలో వైరల్ స్లోగన్ ఇదే !
ఆప్ఘన్ పరిణామాలు అమెరికాలో రాజకీయాలు మారుస్తున్నాయి. అమెరికా సైన్యం ఖాళీ చేసే నిర్ణయం తీసుకున్న ట్రంప్ ఇప్పుడు తప్పు అంతా బిడెన్‌దేనని అంటున్నారు. అయన మద్దతు దారులు సెటైరిక్ ప్రచారం చేస్తున్నారు.
" మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" ఇది డొనాల్డ్ ట్రంప్ మొదటి సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసినప్పుడు వాడిని స్లోగన్. అది బాగా వర్కవుట్ అయింది. అయితే అది రెండో సారి కలసి రాలేదు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు బిడెన్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో హోర్డింగ్‌లు వెలిశాయి. కాకపోతే అమెరికా అనే పదం ప్లేస్‌లో తాలిబన్లు అని ఉంటున్నాయి. " " మేకింగ్ తాలిబన్ గ్రేట్ ఎగైన్ " అన్న క్యాప్షన్ పెట్టి బిడెన్ బొమ్మను తాలిబన్ రూపంలోకి మార్చి హోర్డింగ్‌లు పెట్టేస్తున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి. తామే పెడుతున్నామని రిపబ్లికన్లు నిర్మోహమాటంగా చెబుతున్నారు.
A former Pennsylvania state senator is telling Fox News Wednesday that he has put up around 15 billboards locally with a photo of President Biden in military gear alongside the message "Making the Taliban Great Again."
— D. Scott @eclipsethis2003 (@eclipsethis2003) September 15, 2021
The man behind the billboards is Scott Wagner! pic.twitter.com/MYutAUZRI4
ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఖాళీ చేయాలని నిర్ణయించడంతోనే తాలిబన్లు ఆప్ఘన్‌పై పూర్తి స్థాయి పట్టు సాధించారు. తమ నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బిడెన్ పదే పదే సమర్థించుకున్నారు. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం జో బిడెన్‌పై విరుచుకుపడుతున్నారు. మళ్లీ సైన్యాన్ని ఆప్ఘన్ పంపాలని డిమాండ్ చేస్తున్నారు. బిడెన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ ఆరోపణలకు తగ్గట్లుగానే ఆయన మద్దతుదారులు బిడెన్‌పై బిల్‌బోర్డులతో ప్రచార దాడికి దిగుతున్నారు. Also Read : కాబూల్‌లో తాలిబన్లతో ఐరాస రాయబారి భేటీ.. కారణమిదే!
తాము అమెరికాను తరిమేశామని తాలిబన్లు ఓపెన్‌గా చెబుతున్నారని ఇది అవమానకరమని ట్రంప్ మద్దతుదారులు అంటున్నారు. నిజానికి ట్రంప్ హయాంలోనే ఆప్ఘన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌లో యుద్ధాన్ని కొనసాగించడం ఆయనకు అసలు ఇష్టం లేదు. బలగాలను వెనక్కి పిలిపించాల్సిన సమయం వచ్చిందని అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్ ప్రకటించారు. ఏకపక్షంగా తాలిబాన్లతో ట్రంప్ చర్చలు మొదలుపెట్టారు. ఉపసంహరణ తేదీని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ఉపసంహరణ జరిగింది. కానీ ఇప్పుడు అమెరికా సైన్యం వెనక్కి వచ్చే సరికి అక్కడ పరిస్థితి మారిపోయింది. వెంటనే ఆయన యూటర్న్ తీసుకుని బిడెన్ చేతకానితనమని విమర్శలు గుప్పిస్తున్నారు. అదే తాను ఉంటే ఏం చేసేవాడినో చెబుతున్నారు.
Also Read: TIME Most Influential People: ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ, బంగాల్ బెబ్బులి దీదీకి చోటు
అమెరికా అధ్యక్షులుగా ఎవరు ఉన్నా అల్‌ఖైదా తరహాలో తాలిబాన్లు అమెరికాకు పెద్ద ముప్పు కాదనే భావించారు. తాలిబాన్లను తమ శత్రువులుగా భావించలేదు. అల్ ఖైదాను అంతం చేసేందుకే అమరికా అధ్యక్షులు ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు తాలిబన్లు వాకి ఇబ్బందికరంగా తయారయ్యారు. ఇదే అంశం అక్కడ రాజకీయం అవుతోంది. తాలిబన్లు నిజంగానే గ్రేట్ అయితే.. అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న బిడెన్‌కే రాజకీయ కష్టాలు రావొచ్చన్న అంచనా ఉంది.
Also Read : తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఎంపీ నుస్రత్ ! పెళ్లి చేసుకోకుండానే ...