News
News
X

Nusrat Jahan : తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఎంపీ నుస్రత్ ! పెళ్లి చేసుకోకుండానే ...

ఎంపీ నుస్రత్ జహాన్ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ పెళ్లి చెల్లదని భర్తతో దూరంగా ఉంటున్న ఆమె తల్లి కావడంతో ఆ బిడ్డకు తండ్రెవరన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆమె సమాధానం ఇచ్చారు.

FOLLOW US: 
 
బెంగాలి నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ తన బిడ్డకు తండ్రెవరో ప్రకటించారు. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అప్పట్నుంచి ఆమె బిడ్డకు తండ్రెవరు అన్న చర్చ జరుగుతోంది. బిడ్డ పుట్టాక బయటకు వచ్చిన నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయినా ఆమె నోరు విప్పలేదు. తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన బిడ్డకు తండ్రి పేరుగా  నటుడు యష్‌ దాస్‌ గుప్తా పేరును చేర్చింది. దీంతో ఆ బిడ్డకు తండ్రి ఎవరనే సస్పెన్స్‌కి తెరపడింది.

Also Read : ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ, బంగాల్ బెబ్బులి దీదీకి చోటు

బెంగాల్‌ ఎంపీ నుస్రత్ జహాన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినీ నటిగా స్టార్ స్టేటస్ అనుభవిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఓ సంచలనం అయితే పోటీ చేసి గెలవడం మరో రికార్డు. ఆమె గురించి అందరూ అలా చెప్పుకుంటున్న సమయంలోనే నిఖిల్ జైన్ అనే బాయ్ ప్రెండ్‌ను టర్కీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవడం మరో సంచలనం. ఇక అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో హఠాత్తుగా నిఖిల్ జైన్ నుస్రత్ ప్రెగ్నెంట్ అని.. ఆమె బిడ్డతో తనకు సంబంధం లేదని ప్రకటించడం ఇక హాట్ టాపిక్ కాకుండా ఉంటుందా..?

Also Read : బీజేపీలో మోడీ, షా వేరే వాళ్లను ఎదగనీయడం లేదా ? బలహీనుల్నే ఎందుకు సీఎంలుగా చేస్తున్నారు ?

News Reels

నిఖిల్ జైన్‌ను టర్కీలో పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ ఆ పెళ్లి భారత చట్టాల ప్రకారం చెల్లదని చెప్పి నుస్రత్ కూడా ప్రకటించారు. నిఖిల్ జైన్‌తో సంబంధం లేదని.. తన డబ్బులు అన్నీ తీసుకున్నాడని ప్రత్యారోపణలు చేశారు. పెళ్లే చెల్లదన్నారు కాబట్టి ఇక విడాకుల ప్రస్తావన కూడా రాలేదు. ఈ లోపు ఆమె కూడా తను ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పలేదు. తాను కారణం కాదన్న నిఖిల్ జైన్‌ ప్రకటననూ ఖండించలేదు. దాంతో ఆమె ప్రెగ్నెన్సీకి కారణం ఎవరన్న చర్చ నెటిజన్లలో జరిగింది. అయితే అప్పటికి ఆమె యష్ దాస్ గుప్తా అనే నటుడితో సన్నిహితంగా ఉంటూండటంతో  ఆయనే కారణం అని అనుకున్నారు. కానీ అధికారికంగా నుస్రత్ జహాన్ మాత్రం ప్రకటించలేదు.

Also Read : దావూద్‌కి బ్రదర్స్‌, కసబ్‌కి కజిన్స్‌ లాంటి వాళ్లు.. వీళ్లు మామూలోళ్లు కాదు!
గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో `ఎస్‌ఓఎస్‌ కోల్‌కతా` సినిమా షూటింగ్‌ టైమ్‌లో నుస్రత్‌, యష్‌ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. అయితె యష్‌ దాస్‌ గుప్తాకు ఆల్రెడీ పెళ్లి అయింది. ముంబయికి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న స్వేత సింగ్‌ ని యష్‌ పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అందుకే వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకోనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అధికారికంగా తన కుమారుడికి తండ్రి పేరును యష్ దాస్ గుప్తాను చేర్చడంతో  విషయం క్లియర్ అయిపోయింది. యష్ దాస్ గుప్తా సినీ నటుడే కాదు బీజేపీ నేత కూడా..!

Also Read : పొరపాటున అకౌంట్‌లో రూ. ఐదున్నర లక్షల జమ ! మోడీ వేశారని వాడేసుకున్న వ్యక్తి ! తర్వాత కథ చాలా ఉంది..

Published at : 16 Sep 2021 12:44 PM (IST) Tags: YASH DAS GUPTA MP NUSRAT BENGAL MP TRINAMOOL MP NUSRAT

సంబంధిత కథనాలు

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

Hyderabad Crime News: ఇష్టపడ్డ పాపానికి బ్లేడు దాడికి గురైన యువకుడు

Hyderabad Crime News: ఇష్టపడ్డ పాపానికి బ్లేడు దాడికి గురైన యువకుడు

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

Hyderabad Racing: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ - ఈ రోడ్లు మూసివేత

Hyderabad Racing: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ - ఈ రోడ్లు మూసివేత

టాప్ స్టోరీస్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?