Online Money : పొరపాటున అకౌంట్‌లో రూ. ఐదున్నర లక్షల జమ ! మోడీ వేశారని వాడేసుకున్న వ్యక్తి ! తర్వాత కథ చాలా ఉంది..
బ్యాంక్ అధికారి పొరపాటుతో ఓ వ్యక్తి ఖాతాలో ఐదున్నర లక్షలు జమ అయ్యాయి. అది మోడీ నల్లధనం వెనక్కి తెచ్చి బ్యాంకులో వేసిందని అ వ్యక్తి వాడేసుకున్నారు. బ్యాంక్ అధికారులు బతిమాలుతున్న ఇవ్వడం లేదు.
అంతా ఆన్ లైన్ కాలంలో ఓ బ్యాంకు అకౌంట్‌కు బదులు ఇంకో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపడం ప్రతి ఒక్కరికి అనుభవమవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డబ్బులు ఎవరికిపోయాయో తెలుసుకుని వారిని బతిమిలాడుకుని వెనక్కి తెచ్చుకుంటాం. పెద్ద మొత్తం అయితే వారు తిరిగి ఇవ్వకపోతే పోలీసుల వరకూ వెళ్తాం. అయితే అలా డబ్బులు తీసుకున్న వ్యక్తి అవి నాకు " మోడీ పంపిన డబ్బులు " అని దబాయిస్తే ఏం చేస్తాం..? తలలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేం..! బీహార్ లో ఇలాంటి మోడీ ఫ్యాన్ ఒకరు అక్కడి గ్రామీణ బ్యాంక్ అధికారికి తగిలాడు. ఐదున్నర లక్షలు ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక తంటాలు పడుతున్నాయి. Also Read : దిల్లీలో బాణసంచా అమ్మకాలు, స్టోరేజీపై బ్యాన్
బీహార్‌లోని ఖరారియా అనే ప్రాంతంలో రంజిత్ దాస్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఓ గ్రామీణ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. అతి అకౌంట్‌లో మార్చిలో ఓ ఫైన్ మార్నింగ్ ఐదున్నర లక్షల రూపాయలు జమ అయ్యాయి. అంతే అతని ఆనందానికి అవధుల్లేవు. బ్యాంకులో డబ్బులు పడిన మెసెజ్ ఫోన్‌లో చూసిన తర్వాత మనోడి మైండ్‌లో ఒక్కటే స్ట్రైక్ అయింది. అదేమిటంటే " స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తీసుకు వస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షలు వేస్తానని " ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన విషయం. వెంటనే మోడీకి దండం పెట్టుకున్నారు. ఆయన హామీని నెరవేరుస్తున్నాని.. మొదటి ఇన్ స్టాల్‌మెంట్ అనుకున్నారు. అంతే.. మరో మాట లేకుండా డబ్బులు డ్రా చేసుకుని అప్పులు తీర్చుకుని ఇతర అవసరాలకు వాడేసుకున్నారు. Also Read : నూతన రక్షణ భవనాలను ప్రారంభించనున్న మోదీ.. ఇవే ప్రత్యేకతలు
అయితే ఓ రోజు పొద్దున్నే ఆయన వద్దకు బ్యాంక్ అధికారులు వచ్చారు. పొరపాటున బ్యాంక్ కౌంట్‌లో ఐదున్నర లక్షలు జమ చేశామని తిరిగి ఇవ్వాలని కోరారు. దానికి రంజిత్ దాస్ ఒప్పుకోలేదు. అవి మోడీ పంపాడని వాదించాడు. ఎన్ని సార్లు చెప్పినా అదే మొండి పట్టుదల చూపించడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దగ్గరా రంజిత్ దాస్ అదే చెప్పారు. మోడీ ఇస్తామన్న పదిహేను లక్షల్లో మొదటి ఇన్ స్టాల్‌మెంట్ వచ్చిందనుకున్నానని.. అందుకే తీసుకుని వాడేసుకున్నానని ఇప్పుడు పైసా లేవని తేల్చేశాడు . దీంతో తప్పు చేసిన బ్యాంక్ ఉద్యోగి లబోదిబో అంటున్నాడు. పోలీసులు రంజిత్ దాస్ మీద ఏం కేసు పెట్టాలో తెలియక తికమకపడుతున్నారు. Also Read : త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.4000.. కానీ ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
గత మార్చి నుంచి రంజిత్ దాస్ వెంటపడుతూనే ఉన్నారు. ఇప్పటికి రంజిత్ దాస్ గ్రామంలో అరుగు మీద కూర్చుని అదే చెబుతున్నాడు. కొసమెరుపేమిటంటే... మోడీ గారు మిగతా రెండు ఇన్‌స్టాల్మెంట్లు ఎప్పుడు ఇస్తారని ఆయన వాకబు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ ఆ డబ్బులు పొరపాటున తన అకౌంట్‌లో పడ్డాయని నమ్మడం లేదు. మోడీ అంటే అంత నమ్మకం మరి.. Also Read : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !