PM Kisan Samman Nidhi Yojana: త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.4000.. కానీ ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రైతులకు గుడ్ న్యూస్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రైతులు.. పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే త్వరగా చేసుకోండి. ఎందుకంటే త్వరలో మీ అకౌంట్ లోకి ఆ పథకం డబ్బులు రాబోతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మీ ఖాతాలో రూ .2000 డిపాజిట్ చేస్తారు, తరువాత డిసెంబర్‌లో మరో వాయిదా రూ.2000 వచ్చేస్తాయి.
అన్నదాతలకు శుభవార్త వచ్చింది. పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన నుంచి మరో తాజా అప్ డేట్ తెలిసింది. రైతులకు త్వరలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. పీఎం కిసాన్ అక్టోబర్ లేదా నవంబర్ లో రైతుల ఖతాల్లోకి నేరుగా పీఎం కిసాన్ డబ్బులు పడనున్నాయి.
అయితే.. ఈ మెుత్తం రావాలంటే ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు రిజిస్ట్రేషన్ కావాలి. దీనికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. పథకం కింద డబ్బులు రావాలంటే... రైతులు పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీ దరఖాస్తు ఆమోదిస్తే... మీరు అక్టోబర్ లేదా నవంబర్ నాటికి మీ ఖాతాల్లో రూ.2000 డిపాజిట్ చేస్తారు. మరో వాయిదా కింద.. డిసెంబర్‌లో రూ.2000 డిపాజిట్ అవుతాయి.
మరో శుభవార్త
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రైతులకు అందించే మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు సమాచారం. ఇదే జరిగితే, రైతులు ప్రతి సంవత్సరం ఇంతకు ముందు రూ. 6000 పొందేవారు.. కానీ ఇకపై మూడు వాయిదాలలో రూ .12000 అందుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపు 12.14 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
- ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.
- 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.
- తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.
- దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ముందుకు వెళ్లాలి.
- ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి
- బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.
- ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు.
పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.
Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు