News
News
X

AP TS Crime : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో ఐపీసీ నేరాలు పెరిగిపోతూండగా.. తెలంగాణలో ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువవుతున్నాయి.

FOLLOW US: 


తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019తో  పోలిస్తే 2020లో నేరాల సంఖ్య 60 శాతానికిపైగా పెరిగినట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు విడుదల చేసింది. తెలంగాణలో నేరాల సంఖ్య ఆ స్థాయిలో పెరగకపోయినప్పటికీ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పెరిగిపోతున్న నేరాలకు అడ్డుకట్ట వేయడంలో రెండు రాష్ట్రాల్లోనూ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమవుతోందన్న విమర్శలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నివేదికల ద్వారా వచ్చే అవకాశం ఉంది.

ఆంద్రప్రదేశ్‌లో నేరాల విప్లవం

ఏపీలో నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య ఏకంగా 63శాతం పెరిగాయి. జాతీయ స్థాయిలో సగటు 23 శాతం మాత్రమే ఉంది.  2019లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,  45,751 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీతో పాటు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయి. అదే 2020లో ఈ కేసుల సంఖ్య 2, 38, 105కి చేరింది. అంటే దాదాపుగా ఒక్క ఏడాదిలోనే 93వేల కేసులు అదనంగా నమోదయ్యాయి. ఇది అసాధారణం. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసుల నమోదు ఉంది. దేశంలో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి వచ్చింది.

Also Read : చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..

మహిళలు, ఎస్టీలపై తగ్గిన దాడులు

ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో నమోదవుతున్న కేసుల విషయంలో ఏపీలో భిన్న రికార్డులు నమోదయ్యాయి. ఎస్సీ మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. ఎస్టీలపై జరిగిన దాడుల కేసులు మాత్రం 2019తో పోలిస్తే 2020లో పది కేసులు తగ్గాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశంలో పదో స్థానంలో ఏపీ ఉంది. మొత్తం 2020లో 17,089 కేసులు నమోదయ్యాయి. అయితే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది.

Also Read : ముసలి మొగుడు - పడుచు పెళ్లాం" మోసాలు

తెలంగాణలో సైబర్, ఆర్థిక నేరగాళ్ల పంజా

తెలంగాణలో నేరాల సంఖ్య ఏపీ స్థాయిలో పెరగలేదు.  2019లో తెలంగాణలో మొత్తం నమోదైన నేరాల సంఖ్య  1,31, 254 కాగా 2020లో ఈ సంఖ్య  1, 47,504. ఏపీతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. సైబర్ నేరాలు తెలంగాణలో అతి వేగంగా పెరుగుతున్నాయి.   సైబర్‌ నేరాలు 2019లో 2,691గా ఉంటే 2020కి వచ్చేసరికి ఏకంగా 5,024కు చేరుకున్నాయి. సైబర్ నేరాల నమోదులోతెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది మనుషుల అక్రమ రవాణా విషయంలో తెలంగాణలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో 104 నమోదయ్యాయి. మహారాష్ట్రలో 154కేసులు నమోదయ్యాయి. 

Also Read : రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు..
వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు, వాటిపై విచారణలు, శిక్షలు పడుతున్న విషయంపైనా జాతీయ నేర గణాంక సంస్థ రికార్డులు విడుదల చేసింది. 2020కి నమోదైన శిక్షల్లో ఖరారు శాతం 25.6శాతంగా నమోదైంది. మిగతా కేసులన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల నేరస్తులకు శిక్షలు పడటంలేదు. ఈ కారణంగా నేరగాళ్లకు ధైర్యం పెరుగుతోందన్న విశ్లేషణలు చాలా కాలంగా న్యాయనిపుణులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

Also Read : ప్రియుడి మోజులో పెంచిన తల్లిని హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి దారుణం...

Published at : 15 Sep 2021 09:59 AM (IST) Tags: telangana Andhra national crime records NCRB CRIMES NATIONAL CRIMES

సంబంధిత కథనాలు

SSC JE 2022: జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే!

SSC JE 2022: జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే!

Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!

Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

టాప్ స్టోరీస్

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!