X
Super 12 - Match 22 - 28 Oct 2021, Thu up next
AUS
vs
SL
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 23 - 29 Oct 2021, Fri up next
WI
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

మోసం కేసులో ఓ జంటను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ జంట చేసింది ఆ ఒక్క మోసం కాదని గత ఏడేళ్లుగా పదుల సంఖ్యలో మోసాలు చేశారని తేలింది. ఆ జంట టిక్‌టాక్‌లతో చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

వాళ్లు కనిపించడానికి "ముసలి మొగుడు - పడుచు పెళ్లాం" టైప్‌లో ఉంటారు. కానీ వేషాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. టిక్‌టాక్‌లు, షార్ట్‌ వీడియోలతో చూసే వారందర్నీ టెంప్ట్ చేస్తారు. బిల్డప్ అయితే హై ఫైగా ఉంటుంది. వారి మాయలో పడిపోయిన వారికి అరి అసలు స్వరూపం తెలిసే సరికి చేతి చమురు మొత్తం వదులుతుంది. ఈ కన్నింగ్ కపుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.  వారి పేర్లు మామిడాల శ్రీధర్,చేరుకుమిల్లి గాయత్రి. ఏ ఊరు అంటే.. ఎక్కడ  మోసం చేయడానికి అమాయకులు దొరుకుతారో అదే వాళ్ల ఊరు.
Cheating Couple :  వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..? Also Read : రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది

ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద శ్రీధర్, గాయత్రి అనే దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం తన బిడ్డకు విదేశాల్లో చదువుకునేందుకు సీటిప్పిస్తానని చెప్పి  రూ. 44 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గౌరీ శంకర్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గర ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారి అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత వారి పై ఉన్న కేసులన్నీ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చాయి. వరుసగా వారు చేసిన మోసాల సంఖ్య బయటకు వస్తూండటంతో రాసుకోలేక పోలీసుస్టేషన్ రైటర్లు తంటాలు పడాల్సి వస్తోంది.
Cheating Couple :  వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

Also Read : ఇంట్లో ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడలు.. చూసేసిన మామయ్య, చివరికి దారుణం

శ్రీధర్, గాయత్రి దపంతులకు వేరే వ్యాపారం, ఉద్యోగం ఏమీ లేదు. వారి పని మోసం చేయడమే. ఎవరైతే నమ్ముతారో వాళ్లను అడ్డంగా మోసం చేస్తారు. ఆ నమ్మవాళ్ల అవసరాల్ని కనిపెట్టి.. వారికి సాయం చేస్తామని చెబుతారు. అది వాళ్ల పిల్లల చదువా, లేకపోతే  సబ్సిడీ రుణాలా అనేది వాళ్ల మాటల ద్వారా తెలుసుకుంటారు. తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని ఇట్టే పని చేయిస్తామని కొంత ఖర్చు అవుతుందని చెబుతారు. అలా ప్రారంభించి... ఎంత ఇస్తే ఇంత వరకూ పిండుకుంటారు. చివరికి జెండా ఎత్తేస్తారు. వీరిని నమ్మించడానికి ఈ దంపతులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు.
Cheating Couple :  వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

Also Read : ప్రియుడి మోజులో పెంచిన తల్లిని హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి దారుణం...

వీరు తమను మోసం చేశారంటూ గోకవరంతో పాటు రాజమండ్రి ,జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం, ప్రకాష్ నగర్,బొమ్మూరు  పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు వీరి గురించి ఆరా తీసి వీరి ఫోన్లను చెస్తే వీరి వేషాలన్నీ బయటపడ్డాయి. ఎక్కడైనా మోసం చేసి ఆ మోసం బయటపడే సమయంలో జెండా ఎత్తేయడం వీరి స్టైల్.  రాజమండ్రి  ,బొమ్మూరు సమీపంలోని రాజవోలు ఇలా అనేక చోట్లకు తిరిగారు. మొత్తంగా ఏడేళ్ల నుంచి వీరి మోసాలు సాగుతున్నాయి.
Cheating Couple :  వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

పోలీస్ కేసులు పడకుండా అప్పుడప్పుడు పోలీసులతో కలిసి తిరుగుతున్నట్లుగా షో చేసేవారు. ఆ పనికి.. ఈ పనికి విరాళాలిస్తున్నట్లుగా స్టేషన్లకు వెళ్లేవారు. పోలీసులతో ఫోటోలు దిగి ప్రచారం చేసుకునేవారు.
Cheating Couple :  వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ వారి బాధితులు మాత్రం అనేక ముంది ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. వారి వేషాలు చూసి మోసాలు కాదు.. ఇంకా ఏవేవో భాగోతాలు నడిపి ఉంటారని పోలీసులు కూపీ లాగుతున్నారు. 

Also Read : 25 సార్లు లేచిపోయి తిరిగివచ్చినా ఆదరిస్తున్న భర్త ! ప్రేమంటే ఇదేనా ?

Tags: Crime cheating cheating couple rajamundry andhra crime

సంబంధిత కథనాలు

AP Crime: ఈ కేటుగాళ్లు చాలా ముదుర్లు... ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా... ఎలా చిక్కారంటే..?

AP Crime: ఈ కేటుగాళ్లు చాలా ముదుర్లు... ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా... ఎలా చిక్కారంటే..?

T20 WC Ind vs Pak: యోగీ మార్క్‌ ట్రీట్‌మెంట్‌..! పాక్‌ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు

T20 WC Ind vs Pak: యోగీ మార్క్‌ ట్రీట్‌మెంట్‌..! పాక్‌ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు

Miss Telangana Suicide Attempt: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు

Miss Telangana Suicide Attempt: లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం... సకాలంలో స్పందించి రక్షించిన పోలీసులు

Crime News: పిల్లాడు కాదు.. కామాంధుడు.. పొలాల్లోకి లాక్కెల్లి.. 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం

Crime News: పిల్లాడు కాదు.. కామాంధుడు.. పొలాల్లోకి లాక్కెల్లి.. 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం

Hyderabad Realtor: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..

Hyderabad Realtor: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Covid 19 Restrictions: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు

Covid 19 Restrictions: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు

Nagarjuna Meet Jagan : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

Nagarjuna Meet Jagan :  జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !