Hyderbad Crime News: ప్రియుడి మోజులో పెంచిన తల్లిని హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి దారుణం... నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ లో పెంచిన తల్లిని హత్య చేసింది దత్త పుత్రిక. ప్రియుడితో కలిసి ఇన్నాళ్లు ప్రేమగా పెంచిన తల్లిని కడతేర్చింది.
ప్రియుడి మోజులో పెంచిన తల్లిని కడతేర్చిందో యువతి. ఇన్నాళ్లు ఆశ్రయమిచ్చిన అమ్మను హత్యచేసింది. పెంచిన తల్లినే కనికరం లేకుండా హత్యచేసి గుట్టుచప్పుడు కాకుండా ఊరుబయట రోడ్డు పక్కన పడేసింది. మృతురాలు మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. దత్త పుత్రికపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం బయటపడింది.
Also Read: Mumbai Woman Rape: ముంబయిలో నిర్భయ తరహా ఘటన.. 45 ఏళ్ల మహిళపై కిరాతకంగా దాడి
పెంచిన కూతురే
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పురకు చెందిన మేరీ క్రిస్టియన్ అనే మహిళ మారిక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మేరీ క్రిస్టియన్ కు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరకీ వివాహం జరిపింది. తర్వాత మేరీ క్రిస్టియన్ ఓ ఆశ్రమం నుంచి రూమా అనే యువతిని దత్తత తెచ్చుకుంది. రూమా ఓ యువకుడితో ప్రేమలో పడింది. ప్రియుడితో కలిసి పెంపుడు తల్లి మేరీ క్రిస్టియన్‌ను మూడు రోజుల క్రితం హత్య చేసింది. మేరీని కొబ్బరితాడుతో మేడకు ఉరివేసి చంపినట్లు తెలుస్తోంది.
సొంత కుమార్తె ఫిర్యాదు
హత్య చేసిన అనంతరం దుప్పట్లో చుట్టి హిమాయత్‌సాగర్ చెరువు సమీపంలోని రహదారి పక్కన పడేసి పరారయ్యారు. మూడు రోజులుగా మేరీ క్రిస్టియన్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సొంత కుమార్తె రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దత్త పుత్రిక రూమాను విచారించడంతో అసలు విషయం బయటపడింది. మేరీని హత్య చేసినట్లు అంగీకరించి మృతదేహాన్ని చూపించారని రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్ వెల్లడించారు.
Also Read: AP Crime: కడప జిల్లాలో దారుణం.. మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ
Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?
Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు
Also Read: సాయి ధరమ్ తేజ్ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు
Also Read: Sai Dharam Tej Health Update: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు