Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Andhra King Taluka OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యింది. రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది.

Ram Pothineni's Andhra King Taluka OTT Platforrm Locked : టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూక'. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్ ఫాం సైతం లాక్ చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ పూర్తైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ రైట్స్‌ను Zee గ్రూప్స్ సొంతం చేసుకోగా... ZEE సినిమాలు, Zee5లో ప్రీమియర్ కానుంది. అయితే, ఒకేసారి అటు ఓటీటీలోకి, ఇటు టీవీల్లోకి వస్తాయా? లేదా ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత టీవీల్లో ప్రీమియర్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
ఈ మూవీలో రామ్, భాగ్యశ్రీలతో పాటు ఉపేంద్ర, మురళీ శర్మ, రావు రమేష్, వీటీవీ గణేష్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేం మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
ఓ స్టార్ హీరోకు అతని వీరాభిమానికి మధ్య జరిగే కథను ఎమోషనల్‌గా చూపించారు. రాజమండ్రి కుర్రాడు సాగర్ (రామ్)కు హీరో సూర్య (ఉపేంద్ర) అంటే పిచ్చి. తన అభిమాన హీరో మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తుంటాడు. అయితే, ఆ అభిమానం శ్రుతి మించి స్నేహితుల నుంచి తను ప్రేమించిన అమ్మాయి వరకూ ఎంతోమంది ఎగతాళి చేస్తుంటారు. ఇలా ఎన్నో అవమానాలు పడతాడు. ఈ క్రమంలో హీరో సూర్య సాగర్‌ను కలవాలని అనుకుంటాడు? అసలు అభిమాని కోసం ఎందుకు హీరో రావాల్సి వచ్చింది? సాగర్ ఏం చేశాడు? అతని ప్రేమ సక్సెస్ అయ్యిందా? అభిమాని కోసం ఆ హీరో ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















