Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Raju Weds Rambai Review : లేటెస్ట్ విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ టీం బంపరాఫర్ ప్రకటించింది. ఏపీలో సెలక్టెడ్ స్క్రీన్లలో మూవీని ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పించింది.

Raju Weds Rambai Movie Free Tickets For Women In AP : చిన్న సినిమాగా వచ్చి హార్ట్ టచింగ్ విలేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల మదిని దోచేసింది రీసెంట్ మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తూ మహిళలకు ఓ బంపరాఫర్ అనౌన్స్ చేసింది.
ఫ్రీగా మూవీ టికెట్స్
ఏపీలో మహిళలందరూ ఈ మూవీని సెలక్ట్ చేసిన కొన్ని థియేటర్లలో గురువారం ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'మనసును కదిలించే రాంబాయి కథ... ప్రతీ మహిళ కోసం... మేజర్ సెంటర్స్‌లో గురువారం ఫ్రీ స్క్రీనింగ్' అంటూ రాసుకొచ్చారు. టికెట్లను ఫ్రీగా థియేటర్స్ వద్దే తీసుకోవచ్చని సూచించారు. ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అన్నారు.
Also Read : డిసెంబర్ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
థియేటర్స్ ఇవే...
- విశాఖపట్నం - జగదాంబ, శ్రీకన్య
- విజయనగరం - కృష్ణ
- కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్
- రాజమండ్రి - ఊర్వశి కాంప్లెక్స్
- శ్రీకాకుళం - సూర్య మహల్
- ఏలూరు - అంబిక కాంప్లెక్స్
- తణుకు - శ్రీ వెంకటేశ్వర
- గుంటూరు - బాలీవుడ్
- విజయవాడ - స్వర్ణ కాంప్లెక్స్
- ఒంగోలు - గోపి
- మచిలీపట్నం - సిరికృష్ణ
- నెల్లూరు - సిరి మల్టీప్లెక్స్
- కావలి - లతన 2 షోస్, మానస 2 షోస్
- చిత్తూరు - గురునాథ్
- తిరుపతి - జయశ్యామ్
- నంద్యాల - నిధి
- కర్నూలు - ఆనంద్
- కడప - రవి
- రాయచోటి - సాయి
- హిందూపురం - గురునాథ్
- అనంతపురం - ఎస్‌వీ సినీ మ్యాక్స్
View this post on Instagram
ఈ మూవీలో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తేజస్వి రావు జంటగా నటించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా... చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి, శ్రీరంగం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేశారు.
స్టోరీ ఏంటంటే?
ఓ విలేజ్‌లో అందమైన లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి. ఉమ్మడి ఏపీ వరంగల్ - ఖమ్మం మధ్య ఉన్న పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ వాయించడంలో దిట్ట. చిన్నప్పటి నుంచీ అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్వి రావ్)ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాడు. ఫస్ట్ అతని ప్రేమను వ్యతిరేకించినా ఆ తర్వాత రాజులో నిజాయితీ చూసి రాంబాయి అతని ప్రేమను అంగీకరిస్తుంది. అయితే, తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ). తమ ప్రేమను రాంబాయి తండ్రి అంగీకరించేందుకు రాజు చెప్పిన ఐడియా ఏంటి? తన కూతురి ప్రేమను అడ్డుకునేందుకు వెంకన్న ఏం చేశాడు? వీరి ప్రేమ చివరకు సక్సెస్ అయ్యిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















