By: Ram Manohar | Updated at : 16 Feb 2023 04:45 PM (IST)
జర్మనీలో ఎయిర్‌పోర్ట్‌ల వెబ్సైట్లు పని చేయకుండా పోయాయి. (Image Credits: Fraport)
German Airports Website Hacked:
పెరిగిన ట్రాఫిక్..
జర్మనీలో పలు ఎయిర్‌పోర్ట్‌ల వెబ్సైట్లు పని చేయకుండా పోయాయి. Reuters న్యూస్ ఏజెన్సీ ఈ విషయం వెల్లడించింది. హ్యాక్‌కు
గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నురెంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన వెబ్సైట్ ముందుగా హ్యాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. క్షణాల్లోనే వందలాది ఎంక్వైరీలు వచ్చాయి. అయితే...ఇది కచ్చితంగా హ్యాకర్ల పనేనా అన్నది ఇంకా అధికారులు తేల్చలేదు.
"ఓవర్‌లోడ్ అవడం వల్ల కూడా ఒక్కోసారి వెబ్సైట్లు ఇలా క్రాష్ అవుతుంటాయి. దీని వెనక హ్యాకర్ల హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది"
- ఎయిర్పోర్ట్ ప్రతినిధి
ప్రస్తుతానికి ఈ ప్రభావం ఎంత వరకూ ఉందన్నది తెలియరాలేదు. ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్నీ వెబ్సైట్లను తిరిగి ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. అయితే...కొందరు మాత్రం ఇది కచ్చితంగా హ్యాకర్ల పనే అని తేల్చి చెబుతున్నారు. DDoSగా వివరిస్తున్నారు. DDoS అంటే denial-of-service అటాక్. అంటే ఏదైనా ఓ సర్వర్‌ను టార్గెట్ చేసుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా చూడటం. ఉన్నట్టుండి ట్రాఫిక్ పెరిగేలా చేసి సర్వర్లు డౌన్ అయ్యేలా చేస్తారు.
❗️Airport Websites Down in Germany - Ahead of Massive Strike Action
— MOCez🇷🇺🇱🇾🇮🇶🇾🇪🇨🇳🇵🇰🇵🇸🇸🇾🇮🇳🇮🇷🇰🇵 (@Mousacisse1) February 16, 2023
While many websites of 🇩🇪's major airports are still online, the site for Dortmund is currently down.
ఇటీవలే అంతర్జాతీయంగా లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్ లైన్స్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా చాలా విమానాలు రద్దైనట్టు ఆ కంపెనీ వెల్లడించింది. అయితే...సమస్యకు కారణమేంటన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీనిపై ఇంకా విచారణ చేపడుతున్నట్టు వివరించింది. ప్రస్తుతానికి ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని మాత్రమే చెబుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. జర్మనీలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా..బోర్డింగ్ చాలా ఆలస్యమవుతోందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. లగేజ్‌ను ప్రాసెస్ చేసే విషయంలో డిజిటలైజేషన్ నిలిచిపోయిందని, పేపర్ పెన్ సాయంతో ఒక్కొక్కరి నుంచి సమాచారం తీసుకుని బోర్డింగ్ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఈ విషయమై ట్వీట్ చేసింది.
"ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా లుఫ్తాన్సా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం పడింది. ఈ కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి కొన్ని పూర్తిగా రద్దైపోయాయి. ప్రయాణికులకు కలిగిన ఈ అంతరాయానికి చింతిస్తున్నాం"
-లుఫ్తాన్సా గ్రూప్
⚠️Important information on flight disruption: As of this morning the airlines of the Lufthansa Group are affected by an IT outage, caused by construction work in the Frankfurt region. Unfortunately, this has led to flight delays and cancellations. We are working on -
— Lufthansa (@lufthansa) February 15, 2023
Also Read: No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా కట్టరు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు