అన్వేషించండి

5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఐదేళ్లయింది. బ్లాక్ మనీ బయటకు వచ్చిందో లేదో స్పష్టత లేదు. నగదు చెలామణి మాత్రం తగ్గలేదు. అసలు నోట్ల రద్దు వల్ల ఏం ప్రయోజనం కలిగిందో ఎవరూ చెప్పడం లేదు.


ఐదేళ్ల క్రితం నవంబర్ 8వ తేదీని దేశంలో వంద కోట్ల మంది జనం మర్చిపోలేరు. ఒక వేళ తేదీని మర్చిపోయినప్పటికీ ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో తాము పడిన వేదన, ఆవేదన, పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోరు. ఆ నిర్ణయం డిమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు. బ్లాక్ మనీని అరికట్టడానికి అని.. నగదు చెలామణి తగ్గించడానికి అని ప్రభుత్వం చెప్పింది. దీర్ఘ కాలంలో ఫలితాలు ఉంటాయని చెప్పింది. ఇప్పటికి ఐదేళ్లయింది. మరి డిమానిటైజేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయా ? ప్రజలకు ఆ ఫలాలను అనుభవిస్తున్నారా ?
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : ఇక "ప్రొ బీజేపీ" కాదు ! "పెట్రో పన్నుల" రాజకీయంతో వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ ఇస్తున్న సంకేతం ఇదేనా ?

 బ్లాక్‌మనీ అంతానికే నోట్ల రద్దు అని మొదట్లో ప్రకటన ! మరి లక్ష్యం నెర వేరిందా ? 
  
పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు రూ. వెయ్యి, రూ. ఐదు వందల నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని పెద్దలు దాచుకున్నారని... వాటన్నింటినీ వెలికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దు చేసినందున ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అప్పుడు బ్లాక్ మనీ లెక్కలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణలో రూ. మూడు లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ ఉంటుందని అవి బ్యాంకులకు తిరిగి రావని చెప్పింది. రూ. 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు ఉంటే.. రూ. 12 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని  లెక్కలు చెప్పింది. కానీ ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వివరాల ప్రకారం నోట్లు రద్దు చేసిన రోజు దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. బ్యాంకులకు తిరిగి వచ్చిందిరూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే..99.3 శాతం తిరిగి వచ్చాయి.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే నాయకుల్లో ముందు వరుసలో మోడీ.. ఆ తర్వాతి స్థానాల్లో..

బ్లాక్ మనీ లేదా అఫీషియల్‌గా బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారా ? 

దేశంలో డబ్బంతా బ్యాంకులకు చేరింది. కానీ నల్లధనం ఎంత అనేదనిపై స్పష్టత లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ అయినంత మాత్రాన అంతా న్యాయబద్ధమైన డబ్బులు కాదని అందులోనే నల్లధనం ఉంది.. పట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. కానీ  ఐదేళ్లు గడిచినా ఆ నల్లధనం ఎంత అనేదానిపై స్పష్టత లేదు. ఎంత నల్లధనాన్ని పట్టుకున్నారు..?.  ఎవర్ని పట్టుకున్నారు..? ఫలానా వాళ్లు బ్లాక్‌మనీ డిపాజిట్ చేశారని గుర్తించారా..? అన్న అంశాలపై స్పష్టత లేదు. దేశంలో బ్లాక్ మనీ లేదని ఎవరూ నమ్మరు .. ఎందుకంటే ఇప్పటికీ లెక్కలు లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాజకీయ పార్టీలకు లెక్కలు లేకుండా కోట్ల విరాళాలు ఇస్తున్నారు.  అంటే బ్లాక్ మనీని అధికారికంగా వైట్ చేసుకున్నారు. వారిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read: Delhi Air Pollution: దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి

డిజిటల్ లావాదేవీలే కాదు నగదు చెలామణి కూడా పెరిగింది ! 

నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నగదు చెలామణి ఉండటం వల్ల నల్లధనం పెరిగిందని అందుకే నగదు చెలామణిని తగ్గించడానికి నోట్ల రద్దు చేశామని తెలిపింది.  నిజానికి ప్రజల నగదు చెలామణి ఐదేళ్లలో ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. యాభై శాతం పెరిగింది. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ,  అక్టోబర్‌ 8, 2021 నాటికి  రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. అంటే.. నోట్ల రద్దు ముందు కన్నా  ఎప్పుడే ఎక్కువ నోట్లు చెలామణిలో  ఉన్నాయి. నగదు చెలామణి తగ్గిస్తామని నోట్లు రద్దు చేస్తే ఆది కాస్తా.. ఇవాళ ఎక్కవయింది.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ?

Also Read : భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్

అసలు నోట్ల రద్దు లక్ష్యం ఏమిటి? ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయో కేంద్రం క్లారిటీ ఇస్తుందా ?

నోట్ల రద్దు నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఆషామాషీగా తీసుకున్నా.. మేధోమథనం నిర్వహించి  తీసుకున్నా అది దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు లక్ష్యాలను.. అవి ఇస్తున్న  ఫలాలను ప్రజలకు తెలియచేయాల్సి ఉంది. అయితే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నాయి. పరోక్షంగా తమ నిర్ణయం వల్ల జరిగిన మేళ్లు అంటూ ఆర్థిక మంత్రి వంటి వాళ్లు  గంగిరెద్దులు ఆడించుకునేవాళ్లు కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని సింబాలిక్‌గా చెబుతున్నారు. కానీ అసలు ఆ నిర్ణయం ప్రభావాలపై స్పష్టమైన నివేదిక మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు.
5 Years Demonetisation : నోట్ల రద్దుకు ఐదేళ్లు ! నగదు చెలామణి తగ్గిందా ? బ్లాక్ మనీ బయటకు వచ్చిందా ? 

Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!

కష్టాలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు !

అప్పటికప్పుడు తమ జేబుల్లో ఉన్న నోట్లు చెల్లవని తెలిస్తే ప్రజలకు ఏమవుతుంది..? బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఇవ్వరని తెలిస్తే ఏం జరుగుతుంది..?  బ్యాంకులో డబ్బులున్నా టీ, టిఫిన్ చేయడానికి చేతుల్లో చిల్లర లేక కడుపు కాలితే ఎలా ఉంటుంది ?  ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక ఇబ్బందిపడిన వారు..  పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలను వాయిదా వేసుకున్న వారు... ఏటీఎంల వద్ద పడిగాపులు పడిన వారు.. తమ తమ బాధలను ప్రతీ ఏడాది నోట్ల రద్దు రోజున గుర్తు చేసుకుటూనే ఉన్నారు.  నోట్ల రద్దు ఫలాలేమో కానీ ఈ కష్టాలు మాత్రం ప్రతీ సారి హైలెట్ అవుతూనే ఉన్నాయి. కొసమెరుపేమిటంటే ఐదేళ్ల కిందట డిమానిటైజేషన్ చేపట్టిన కేంద్రం ఇప్పుడు మానిటైజేషన్ కూడా ప్రారంభించింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలను లీజుకొచ్చి ఆదాయం పొందడం.  

Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget