ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి
నక్సల్స్‌కు వ్యతిరేకంగా గన్స్ ఎత్తిన నక్సల్స్.. ఖాకీ క్యాంపులకు గళమెత్తిన ప్రజలు... ఇలా ఛత్తీస్‌ఘడ్‌లోని గిరిజన ప్రాంతాలు హీటెక్కిపోతున్నాయి.
మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు వరుసగా గట్టిగానే దెబ్బలు తగులుతున్నాయి. భారీ వ్యూహంతో నక్సల్స్ ఏరివేత కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. సెర్చ్ ఆపరేషన్ మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారాల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగి మావోయిస్టులు చనిపోయారు. రెండు వారాల్లోనే మూడోసారి అడవిలో కాల్పులు మోత మోగింది.
దంతెవాడలో మరో ఎన్‌కౌంటర్
తాజాగా దంతెవాడ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు మృతి చెందాడు. దంతెవాడ డీఆర్‌జి బలగాలు గాలిస్తుండగా ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు తారసపడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలోనే కాల్పులు జరిగాయని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ్ తెలిపారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత సంఘటన ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహం, 7.62 ఎంఎం పిస్టల్, ఐదు కిలోల ఐఈడీ, వైరు ఇతర పేలుడు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మృతుడు 16వ నంబర్ ప్లాటూన్ కమాండర్ రామ్స్‌గా గుర్తించారు. డీవీసీఎం సభ్యుడు మల్లేష్‌కి గార్డుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత నెలలో రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మొదట ఘటనలో ముగ్గురు మావోయిస్టులు తర్వాత జరిగిన ఘటనలో మరో ముగ్గురు చనిపోయారు.
ALSO READ : నక్సలైట్ల కళ్లుగప్పి నయీం 16 ఏళ్లు ఎలా తప్పించుకోగలిగాడు అన్నదే నయీం డైరీస్ థీమ్
ALSO READ : సోదరులకు భోజనం పెట్టి కానుకలిచ్చే వేడుక, కార్తీకమాసంలో రెండో రోజు 'భగినీ హస్త భోజనం'
ALSO READ : ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఫైటర్స్ రిక్రూట్‌మెంట్ మావోయిస్టులు ఆగ్రహం
మరోవైపు ఛత్తీస్‌ఘడ్‌లో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ పశ్చిమ్ బస్తర్ డివిజన్ నక్సలైట్ల కమిటీ లెటర్ రిలీజ్ చేసింది. బస్తర్ ఫైటర్స్ రిక్రూట్‌మెంట్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇస్తూ అట్టడుగు వర్గాల యువతను ఫూల్స్‌ను చేస్తున్నారని మండిపడ్డారు. బస్తర్ ఫైటర్స్ ద్వారా సొంత తల్లిదండ్రులను, సోదరులను ఎదిరించేలా చేసి మారణహోమం సృష్టించడానికి సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దంతేశ్వరి ఫైటర్స్, దుర్గా ఫైటర్స్, బస్తారియా బెటాలియన్ విదేశీ సైనికుల్లా బీభత్సం సృష్టిస్తున్నారు అన్నారు.
పోలీసులపై తిరగబడ్డ ప్రజలు
బీజాపూర్ జిల్లా సిల్గర్, పుస్నార్ గ్రామస్తుల ఉద్యమం కొనసాగుతోంది. దంతెవాడలోని పోలీసు క్యాంపుపై మరోసారి దాడికి యత్నించారు. జిల్లాలోని మారుమూల నక్సల్స్ ప్రభావిత గ్రామమైన నహరిలో ప్రతిపాదిత కొత్త పోలీసు క్యాంపుకు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసనలు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతులైన పాఠశాలలు, ఆసుపత్రులు, కరెంటు, మంచినీరు కావాలని.. పోలీస్ క్యాంపులు కాదని గ్రామస్తులు తెలిపారు. జైలులో ఉన్న గ్రామస్తులు ఇంకా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మనకు ద్రోహం చేసింది అని బస్తర్‌లో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోంది వారు ఆరోపించారు.