(Source: ECI/ABP News/ABP Majha)
Raghu Rama Krishna Raju: అలా చేస్తే సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు... జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ గురించి దేశం మొత్తం గొప్పగా చెప్పుకోవాలంటే.... పెట్రో ధరలు తగ్గించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. అలాగే ఏపీలో మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అమలు చేయాలన్నారు.
కేంద్రం ఇటీవల ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో పెట్రో ధరలు తగ్గి వినియోగదారుడికి కాస్త ఉపశమనం కలిగింది. రాష్ట్రాలకు కూడా పెట్రో ధరలు తగ్గించాలని కేంద్రం సూచించింది. దీంతో రాష్ట్రాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. పెట్రో ధరలు తగ్గించి ఏపీ సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో మాట్లాడిన ఆయన ప్రజల కష్టాలు చూసి పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, చాలా రాష్ట్రాలు కూడా పెట్రో ధరలు తగ్గించాయన్నారు. ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంధనం రేట్లు, స్కూల్ ఫీజులు, ఇంటి పన్నులు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారన్నారు. యానాం, కర్ణాటక, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో ఏపీ కన్నా తక్కువ ధరలో పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారన్నారు. సీఎం జగన్ ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరారు. ఇంధన ధరల తగ్గించిన విషయంలో కర్ణాటక సీఎం బొమ్మైని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే విధంగా ఏపీలో కూడా రేట్లు తగ్గిస్తే దేశ వ్యాప్తంగా జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు చమురు ఉత్పత్తులపై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంవహించడం, కేదార్నాథ్లో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఆదిశంకరాచార్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం తదితర అంశాలపై మీడియా సమావేశం.https://t.co/bJSkCnPe7q
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) November 5, 2021
Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !
మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అమలు
మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అమలు విషయంపై ప్రధానికి లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మద్యం షాపుల నుంచి వస్తున్న ఆదాయం ఎక్కడికి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. మద్యం షాపుల నుంచి నగదు రూపంలో వసూలు చేస్తున్న దానిలో ప్రభుత్వ ఖజానాలో ఎంత జమ చేస్తున్నారు, ఎవరైనా తమ జేబులో వేసుకుంటున్నారనే అనుమానం అందరిలో ఉందన్నారు. మద్యం షాపుల్లో తక్షణం నగదు వసూలు ఆపి డిజిటల్ పేమెంట్ పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ... నెల్లూరు, కుప్పంలో రసవత్తరంగా ఎన్నికలు
ఎంపీని హింసిస్తే దిక్కు ఎవరు?
జై భీమ్ సినిమాపై స్పందించి ఎంపీ...1995లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారన్నారు. ఆ సినిమాలో గిరిజన యువకుడిని హింసిస్తూ ఉన్న పరిస్థితి తనకు కూడా జరిగిందన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పెద్దగా మారలేదని ఎంపీ స్పష్టం చేశారు. గిరిజనుడ్ని కొడితే దిక్కేంటని ఓ లాయర్ వచ్చారని, తాను ఓ ఎంపీ, తనకు కొడితే దిక్కులేదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. జై భీమ్ సినిమాలో చేసినట్లే తనను కూడా హింసించారని ఆరోపించారు. కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా దిక్కులేదన్నారు. ఎంపీని హింసిస్తేనే దిక్కు లేదంటే అసలు లోపం ఎక్కడుందని ప్రశ్నించారు. ఎక్కువ అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరని ఆయన పేర్కొన్నారు. కేంద్రం పిలుపుతో పెట్రో ధరలు చాలా రాష్ట్రాలు తగ్గించాయని, పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువ ఉన్నాయని గుర్తుచేశారు. పెట్రో ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి