By: ABP Desam | Updated at : 05 Nov 2021 05:03 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియ(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. 14 జడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీలలో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ వరకు అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లులకు 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పరిషత్ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 9వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 17న కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి 18న కౌంటింగ్ జరగనుంది.
Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !
నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు
నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు
ఎన్నికలు జరగనున్న స్థానాల్లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లు, 12 మున్సిపాలిటీల్లో 13 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగునున్నాయి. ఖాళీగా ఉన్న 533 వార్డు మెంబర్లకు కూడా ఈ నెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.
Also Read: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్
మరో స్థానిక సమరం
దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్ అంతటా అమలవుతుంది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు అనేక వివాదాలతో ఎన్నికలు జరిగాయి. చివరికి ఆయన మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలపైనా అనేక వివాదాలు వచ్చాయి. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు మరో స్థానిక సమరం జరుగుతుంది.
Also Read: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ కేడెట్స్- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన మలుపు, ఛార్జ్షీట్లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?