News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YSR Achievement Awards: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్

కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కారాలు అందిస్తోందని, ఏపీలో మహానేత వైఎస్సార్ పేరు మీదుగా గొప్పవారిని, అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని సత్కరించుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో గొప్పవారిని పద్మ, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తుంది. ఏపీలోనూ ప్రభుత్వం ఇదే విధంగా కార్యక్రమం చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని వైఎస్సార్ అవార్డులు ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఏపీ ప్రజలకు సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Koo App
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ శ్రీ బిస్వభూషన్ హరిచందన్, సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు. తెలుగు సంస్కృతికి, కళలకు, మానవతా మూర్తులకు, సామాన్యులుగా కనిపించే అసామాన్యుల ఇస్తున్న గొప్ప అవార్డులు ఇవి అని సీఎం వైయస్ జగన్ తెలిపారు. ప్రతి ఏటా నవంబర్ 1న ఈ అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. @ysjagan #YSRAwards - CMO AndhraPradesh (@AndhraPradeshCM) 1 Nov 2021

డాక్టర్‌ వైఎస్సార్‌ అంటే నిండైన తెలుగుదనం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహానేత, డా. వైఎస్సార్ పేరు చెబితే ప్రజలకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. రైతులు, వ్యవసాయం మీద మమకారంతో గ్రామం, పల్లెల మీద మా ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రతి ఒక్కరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తేనే కనిపించే విషయాలని గుర్తుచేశారు.

Also Read: వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభం.. తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్న వాలంటీర్లు

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చూసినా ప్రజా సంక్షేమమే కనిపిస్తోంది. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం నుంచి మొదలుపెడితే.. ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధను తీసుకొచ్చాం. వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు.  

ప్రజల్లో చిరస్థాయిగా గుర్తిండి పోయే నేత కనుకనే ఆయన పేరు మీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇస్తున్నాం. వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలతో పాటు కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నామని ఏపీ సీఎం వివరించారు.

Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌లైన, కళలకు, సంస్కృతికి ఈ ఆవార్డులలో పెద్దపీట వేశారు.  కళాకారులకు అరుగైన గౌరవం అందించాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్ధల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, మనదైన కలంకారీకి, నాదస్వరానికీ, కూచిపూడికి సంబంధించి అందరూ కళాకారులను గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించిన వారిని ప్రత్యేకంగా సన్మానించారు.

వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ కి, సీపీ బ్రౌన్‌ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, ఆర్డీటీ సంస్ధకి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ లాంటి సంస్థలకు, రైతులకు, కలం యోధులకూ అవార్డులు ఇచ్చారు. కవులకు, స్త్రీవాద ఉద్యమానికి,  సామాజిక స్పృహను మేల్కొల్పడంలో సేవలు అందించిన రచయితలకు, విశ్లేషక పాత్రికేయలకు గౌరవం కల్పించేలా అవార్డులు ఇచ్చామని.. ఇక ప్రతి ఏటా నవంబరు ఒకటో తారీఖున ఈ అవార్డులు ఇస్తాంమని సీఎం జగన్ పేర్కొన్నారు.

Also Read: ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 02:02 PM (IST) Tags: YS Jagan ANDHRA PRADESH AP CM YS Jagan AP News YSR AP Formation Day YSR Lifetime Achievement Awards YSR Achievement Awards

ఇవి కూడా చూడండి

Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!

Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై మలయ్యప్పస్వామి- రామకృష్ణ గోవింద అలంకారంలో దర్శనం

Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై మలయ్యప్పస్వామి- రామకృష్ణ గోవింద అలంకారంలో దర్శనం

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

Kinjarapu Atchannaidu: చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు: అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu: చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు: అచ్చెన్నాయుడు

టాప్ స్టోరీస్

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు