AP Formation Day Wishes: ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో తెలుగు ప్రజలకు విషెస్ చెప్పారు. ఏపీ ప్రజలతో పాటు ఛత్తీస్ గఢ్, హరియానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు.
Greetings to the people of Andhra Pradesh, Chhattisgarh, Haryana, Karnataka, Kerala, Madhya Pradesh, Punjab, Lakshadweep and Puducherry on the formation day. My best wishes to the residents of these States and Union Territories for their bright future.
— President of India (@rashtrapatibhvn) November 1, 2021
‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Also Read: వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభం.. తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పింఛన్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
— Narendra Modi (@narendramodi) November 1, 2021
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏపీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్మరించుకున్నారు. ‘అమరజీవి పొట్టి శ్రీరాములుగారి లాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ అందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నానంటూ’ ట్వీట్ చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములుగారి లాంటి ఎంతోమంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం. వారు సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ అందరి సహకారంతో అడుగులు ముందుకు వేస్తున్నా.#APformationday
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2021