(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Air Pollution: దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత క్షీణించింది. ఈ వాయుకాలుష్యం ప్రజల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెట్స్(AQI) 530కు చేరడంతో గాలి పీల్చడానికి ప్రమాదకంగా మారింది. దీనిపై పర్యావరణ వేత్తలు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలో గాలి కాలుష్యానికి మానవ నిర్లక్ష్య ధోరణి కారణమని అంటున్నారు. ఏఎన్ఐతో ప్రముఖ పర్యావరణవేత్త విమ్లెందు ఝా మాట్లాడారు. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలిపారు. వాయుకాలుష్యం కారణంగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 9.5 సంవత్సరాలు తగ్గిపోతుందని ఒక నివేదికలో తేలిందన్నారు. వాయు కాలుష్యంతో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆస్తమా(ఉబ్బసం)తో బాధపడుతున్నారని లంగ్ కేర్ ఫౌండేషన్ పరిశోధనలో తెలిసిందని విమ్లెందు తెలిపారు.
Air pollution kills 15 lakh people every year. A report pointed out that people living in Delhi-NCR loses 9.5 yrs of their lives because of air pollution. Lung Care Foundation says every 3rd child has asthma due to air pollution: Vimlendu Jha, Environmentalist pic.twitter.com/9O1p95bvu6
— ANI (@ANI) November 6, 2021
Also Read: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ
Delhi's overall air quality continues to be in 'severe' category, with overall air quality index (AQI) standing at 533: System of Air Quality & Weather Forecasting & Research
— ANI (@ANI) November 6, 2021
గుండె వ్యాధుల బాధితులకు అలెర్ట్
సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్‌కాస్టింగ్ పరిశోధన ప్రకారం దేశం రాజధాని దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 533కు చేరింది. గాలి కాలుష్యం తీవ్రమైందని తెలిపింది. వాయు కాలుష్యం వల్ల ప్రజలకు ఆరోగ్య సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గంగారాం ఆసుపత్రి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ మొహంతి ANIతో తెలిపారు. గుండె లేదా ఛాతీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరమన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?
కొవిడ్ బాధితులకు మరింత ప్రమాదకరం
ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ILDs), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో బాధపడుతున్న రోగులు కూడా ఈ కాలుష్యంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. సుమారు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు ఆస్తమా, అలెర్జీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అరుణ్ మొహంతి తెలిపారు. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి కూడా ఈ కాలుష్యం ప్రమాదకరమన్నారు. ఆస్తమా ఉన్న పిల్లల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని డా.మొహంతి అన్నారు. వాయు కాలుష్యం తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుందన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
(ఏఎన్ఐ సౌజన్యంతో ఈ ఆర్టికల్ రాశాము)
Also Read: ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ! దీపావళి టపాసులే కారణమా?