Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ
జికా వైరస్ ఉత్తర్‌ప్రదేశ్‌ను గజగజ వణికిస్తోంది. మొత్తం జికా వైరస్ కేసులు 66కు పెరిగాయి.
ఉత్తర్‌ప్రదేశ్ జికా వైరస్‌తో వణుకుతోంది. కొత్తగా 30 జికా వైరస్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసులు 66కు పెరిగాయి. ఈ మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. నేపాల్ సింగ్ వెల్లడించారు.
అక్టోబర్ 25న కాన్పుర్‌లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఆ తర్వాత కేంద్రం ఓ నిపుణుల కమిటీని ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపింది. అయితే జిల్లాలో బుధవారం మరో 25 మందికి వైరస్ సోకింది. ఇందులో ఆరుగురు వాయుసేన అధికారులు కూడా ఉన్నారు. కొత్త కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ తెలిపారు.
మొత్తం 586 బ్లడ్ శాంపిళ్లను లఖ్‌నవూలోని కేజీఎమ్‌యూకు పంపగా అందులో 25 పాజిటివ్‌గా తేలాయి.
వేగంగా..
జికా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్, ఫాగింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ్ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏంటీ వైరస్..?