Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!
భారత క్రికెట్లో మార్పులకు వేళైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసుకు కేఎల్ రాహులకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ సహా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో భారీ మార్పులే జరగనున్నాయి. బయో బుడగలో అలసిపోయిన సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసుకు కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్యం నుంచి తప్పుకోవడంతో కేఎల్‌నే భవిష్యత్తు నాయకుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు!
ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించనుంది. తొలుత టీ20 సిరీసులు ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది. నవంబర్ 17న జైపుర్, 19న రాంచీ, 21న కోల్‌కతాలో టీ20 మ్యాచులు జరుగుతాయి. నవంబర్ 25-29 మధ్య కాన్పూర్‌లో మొదటి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబయిలో రెండో టెస్టు నిర్వహిస్తారు.
'సీనియర్లకు విశ్రాంతి కచ్చితంగా అవసరం. భారత టీ20 స్ట్రక్చర్‌లో కేఎల్ రాహుల్ అంతర్భాగం అనడంలో రహస్యమేమీ లేదు. దాదాపుగా అతడే సిరీసుకు సారథ్యం వహిస్తాడు. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించొచ్చు. అయితే పూర్తి సామర్థ్యం మేరకు కాదు. స్థానిక అధికారులతో కలిసి ఇందుకు నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
దాదాపుగా సీనియర్ క్రికెటర్లు అంతా ఆరు నెలలుగా బయో బుడగల్లోనే ఉన్నారు. ఐపీఎల్ మొదటి అంచెలోనూ బుడగలో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు విరామం దొరికినా వెంటనే క్వారంటైన్ అయ్యారు. ఇంగ్లాండ్‌లోనూ క్వారంటైన్‌లో గడిపారు. ఆ తర్వాత బుడగలోనే ఉన్నారు. అక్కడి నుంచి ఐపీఎల్ కోసం దుబాయ్‌కి వచ్చి అక్కడా బుడగలోనే గడిపారు. ఇప్పుడు ప్రపంచకప్ కోసమూ నియంత్రణలోనే బతుకుతున్నారు. ఇది వారిపై మానసికంగా ఒత్తిడి పెంచింది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా రెండు మ్యాచుల ఓడిపోయేందుకు కారణం బుడగ ఒత్తిడేనని ఆటగాళ్లు చెబుతుండటంతో మార్పులు చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది.
Also Read: Eng Vs SL , Match Highlights: లంకపై పేలిన బట్లర్ బాంబ్.. 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం
Also Read: T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?