By: ABP Desam | Updated at : 01 Nov 2021 11:41 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
సంబరాల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు (Source: Star Sports Twitter)
టీ20 వరల్డ్ కప్‌లో నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించలేక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. శతక్కొట్టిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
163లో 101 బట్లర్‌వే..
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించలేదు. 35 పరుగులకే జేసన్ రాయ్(9), డేవిడ్ మలన్(6), జానీ బెయిర్‌స్టో(0)ల వికెట్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 35 పరుగులు మాత్రమే. అయితే జోస్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌కు ఇయాన్ మోర్గాన్(101 నాటౌట్: 67 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. అనంతరం ఇయాన్ మోర్గాన్ (40: 36 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) అవుటైనా.. జోస్ బట్లర్ గేర్లు మార్చడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 20 ఓవర్లలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు తీయగా.. చమీరకు ఒక వికెట్ దక్కింది.
అదరగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇంగ్లండ్ తరహాలోనే శ్రీలంక కూడా 34 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే జోస్ బట్లర్ తరహాలో ఎవరూ ఆదుకోకపోవడంతో వికెట్ల పతనం అస్సలు ఆగలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉండటంతో 19 ఓవర్లలో 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. వోక్స్, లియాం లివింగ్ స్టోన్ చెరో వికెట్ తీశారు.
Also Read: T20 WC 2021: దుబాయ్ వెండితెరపై..! ఫస్టాఫ్ ఫట్టు.. సెకండాఫ్ సూపర్‌హిట్టు! పాత్రధారులు మారారంతే!
Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!
Also Read: ABP LIVE Exclusive: షమీపై మతపరమైన దాడి..! ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్న కోహ్లీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
India vs South Africa : సఫారీలతో తొలి సవాల్, యువ భారత్ సత్తా చాటేనా?
WPL Auction 2024: ఐపీఎల్ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్ టీమ్‌లోకి త్రిష
Ziva Dhoni : ధోనీ కూతురు జీవా గురించి మీకు ఈ వివరాలు తెలుసా!
WPL Auction 2024: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కళ్లు చెదిరే ధర, అన్నాబెల్‌కు రూ. 2 కోట్లు
Bangladesh vs New Zealand: రెండో టెస్టులో కివీస్ విజయం, గ్లెన్ ఫిలిఫ్స్ హీరో ఇన్నింగ్స్
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>