News
News
X

T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?

యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పిచ్‌లు ఛేజింగ్ చేస్తున్న వారికి బాగా అనుకూలిస్తున్నాయి. దీంతో టాస్ కీలకంగా మారింది.

FOLLOW US: 

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఇండియా ఈ రెండు మ్యాచ్‌ల్లో మైదానంలోకి కూడా దిగకముందే ఓటమి ఖరారైంది. అదేంటి మైదానంలో ఆటతీరు కదా.. గెలుపోటములను నిర్ణయించేది అనుకుంటున్నారా? కానీ దుబాయ్ పిచ్‌లపై గెలుపోటములను నిర్ణయించేది ఆటతీరు కాదు.. టాస్. అవును.. మీరు చదివింది నిజమే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే చాలు.. సగం విజయం అక్కడే లభిస్తుంది.

అయితే ఇది ఏమాత్రం సమంజసం కాదు. మ్యాచ్ మీద మంచు ప్రభావం ఉన్నప్పటికీ.. దాని కంటే పిచ్‌లు ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న పిచ్‌లు.. సాగేకొద్దీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి బంతి చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది. అది టాస్ ఓడిన జట్టు కొంప ముంచుతోంది.

కేవలం భారత్ విషయంలోనే కాదు మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా టాస్ కీలకపాత్ర పోషించింది. సూపర్ 12లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు జరగ్గా.. టాస్ ఓడిన జట్లు కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచాయి. వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్, పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ వంటి చిన్నజట్లు కూడా విజయం అంచుల వరకు వెళ్లి.. చివర్లో ఓటమి పాలయ్యాయి.

ఇక మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 13 సార్లు ఓటమి పాలయ్యాయి. కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించాయి. ఆ మూడిట్లో రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్.. స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో వెస్టిండీస్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

తటస్థ వేదిక అయిన యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి కాబట్టి సరిపోయింది. అదే టెస్టు హోదా ఉన్న దేశాలు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇటువంటి పిచ్‌లు తయారు చేస్తే.. నాసిరకం పిచ్‌లు అంటూ ఈ పాటికి పెద్ద దుమారం రేగేది. ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేటప్పుడు కూడా ఆతిథ్య జట్లు తమకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయించుకుంటాయి. కానీ అవి ప్రవర్తించే విధానంలో మార్పు ఉండదు. ఉదాహరణకు భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. ప్రత్యర్థి జట్లలో కూడా ప్రపంచస్థాయి స్పిన్నర్లు ఉన్నప్పుడు మన బ్యాట్స్‌మెన్ కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు కోకొల్లలు. కానీ అలా కాకుండా టాస్ గెలిచిన వారికి అనుకూలంగా పిచ్‌లు ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు.

Also Read: T20 WC 2021: దుబాయ్‌ వెండితెరపై..! ఫస్టాఫ్ ఫట్టు.. సెకండాఫ్‌ సూపర్‌హిట్టు! పాత్రధారులు మారారంతే!

Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!

Also Read: IND vs NZ, T20 World Cup: వరల్డ్‌క్లాస్ టీం.. వరస్ట్ పెర్ఫార్మెన్స్.. ఎనిమిది వికెట్లతో టీమిండియా చిత్తు

Also Read: ABP LIVE Exclusive: షమీపై మతపరమైన దాడి..! ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్న కోహ్లీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 07:15 PM (IST) Tags: Team India T20 World Cup 2021 Dubai Pitches T20 World Cup Pitches Tosses Win Matches India Semis Chances

సంబంధిత కథనాలు

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

తండ్రి అడుగులే ఆదర్శంగా కామన్వెల్త్‌లో గోల్డ్‌ కొట్టిన శ్రీజ- ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

తండ్రి అడుగులే ఆదర్శంగా కామన్వెల్త్‌లో గోల్డ్‌ కొట్టిన శ్రీజ- ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

Roger Federer: లెజెండ్‌ ప్రామిస్‌ మరి! ఐదేళ్ల క్రితం మాటిచ్చిన కుర్రాడితో టెన్నిస్‌ ఆడిన ఫెదరర్‌!

Roger Federer: లెజెండ్‌ ప్రామిస్‌ మరి! ఐదేళ్ల క్రితం మాటిచ్చిన కుర్రాడితో టెన్నిస్‌ ఆడిన ఫెదరర్‌!

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సెరెనా సంచలన నిర్ణయం

కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సెరెనా సంచలన నిర్ణయం

టాప్ స్టోరీస్

Nara Dishti Dosha: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

Nara Dishti Dosha: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!

Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !

Gorantla Madhav Issue :  వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం -  ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ  !

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం