News
News
X

Ind vs Nz T20 WC: బుడగ బతుకుతో ప్రపంచకప్‌ ఆశలు ఛిద్రం..! కుటుంబానికి దూరమై ఇబ్బంది పడుతున్నాం అంటున్న బుమ్రా

బుడగల్లో కుటుంబాలకు దూరమవ్వడం మానసిక అలసటకు కారణమం అవుతోందని బుమ్రా అంటున్నాడు. విరామం లేకుండా ఆడటం ప్రపంచకప్‌లో ప్రదర్శనపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.

FOLLOW US: 

నెలలుగా బయో బుడగల్లో ఉండటం, కుటుంబానికి దూరమవ్వడం, మానసికంగా అలసిపోవడమే ప్రపంచకప్‌లో ఓటములకు కారణమని టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. బుడగల వల్ల మళ్లీ మళ్లీ ఒకే పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. బౌలర్ల కోసం 20 పరుగులు అదనంగా చేసే క్రమంలో బ్యాటర్లు విఫలమయ్యారని వెల్లడించాడు. భారత జట్టు జూన్‌ నుంచి బయో బుడగల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

'ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నప్పుడు కచ్చితంగా విరామం అవసరం. కానీ మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో తెలిసిందేగా! కరోనా వల్ల బయో బుడగల్లోనే ఉండాల్సి వస్తోంది. అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా శారీరక, మానసిక అలసట వెంటాడుతూనే ఉంది. ఒకే పని మళ్లీ మళ్లీ చేస్తున్నాం. మేం నియంత్రణలో బతుకుతున్నాం' అని బుమ్రా అన్నాడు.

'కొన్నిసార్లు కుటుంబాన్ని వదిలి ఆరు నెలల వరకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఇవన్నీ మనసులో కదలాడుతుంటాయి. కానీ మైదానంలో ఉన్నప్పుడు అవేమీ పట్టించుకోకూడదు. షెడ్యూలింగ్‌, టోర్నీలు మా చేతుల్లో ఉండవు. ఏదేమైనా కుటుంబానికి దూరమవ్వడం, బుడగల్లో ఉండటం ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొడుతుంది. మమ్మల్ని సౌకర్యంగా ఉంచేందుకు బీసీసీఐ చేయాల్సిందంతా చేసింది' అని బుమ్రా వెల్లడించాడు.

'మరో 20-30 పరుగులు చేసి బౌలర్లకు మేలు చేయాలని బ్యాటర్లు భావించారు. అందుకే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రణాళిక విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సులువు అవుతోంది. తొలుత బంతి ఆగి వస్తుండటంతో పుల్‌షాట్లు ఆడి ఔటవుతున్నారు. ఏదేమైనా మంచి, చెడ్డ రోజులు ఉంటాయి. బాగా ఆడుతున్నప్పుడు పొంగి పోవద్దు. ఆడనప్పుడు కుంగిపోవద్దు. వర్తమానంలో ఉంటూ మా ఆటను విశ్లేషించుకొని ముందుకు సాగాలి' అని బుమ్రా పేర్కొన్నాడు.

Also Read: T20 WC 2021: దుబాయ్‌ వెండితెరపై..! ఫస్టాఫ్ ఫట్టు.. సెకండాఫ్‌ సూపర్‌హిట్టు! పాత్రధారులు మారారంతే!

Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!

Also Read: IND vs NZ, T20 World Cup: వరల్డ్‌క్లాస్ టీం.. వరస్ట్ పెర్ఫార్మెన్స్.. ఎనిమిది వికెట్లతో టీమిండియా చిత్తు

Also Read: ABP LIVE Exclusive: షమీపై మతపరమైన దాడి..! ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్న కోహ్లీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 02:23 PM (IST) Tags: India New Zealand Jasprit Bumrah T20 World Cup T20 WC 2021 Ind Vs NZ bubble fatigue

సంబంధిత కథనాలు

గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!

గెలిచిన ప్రైజ్‌మనీ తిరిగి శ్రీలంకకే - ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పెద్ద మనసు!

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

టాప్ స్టోరీస్

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!