T20 World Cup 2021: ఇక అఫ్గాన్ దయ.. టీమ్‌ఇండియా ప్రాప్తం! 'ప్రియమైన శత్రువు' దెబ్బకు కోహ్లీసేన కుదేలు
ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాలి. అందుకే అఫ్గానిస్థాన్‌పై మనం ఆధారపడాల్సి ఉంది. న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడించాలి.
![T20 World Cup 2021: ఇక అఫ్గాన్ దయ.. టీమ్‌ఇండియా ప్రాప్తం! 'ప్రియమైన శత్రువు' దెబ్బకు కోహ్లీసేన కుదేలు T20 World Cup 2021 How India can still qualify for semi-finals know in detail T20 World Cup 2021: ఇక అఫ్గాన్ దయ.. టీమ్‌ఇండియా ప్రాప్తం! 'ప్రియమైన శత్రువు' దెబ్బకు కోహ్లీసేన కుదేలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/31/2cf75e2c5edadde57d08e549b56eeb37_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో 'ప్రియమైన శత్రువు' న్యూజిలాండ్ దెబ్బకు టీమ్‌ఇండియా విలవిల్లాడింది. సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది. రెండో ఓటమితో ఇక అఫ్గాన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. ఇక కోహ్లీసేన సెమీస్ చేరాలంటే అద్భుతాన్ని మించే జరగాలి.
కష్టపెడుతున్న కివీస్
నిజానికి న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్లో టీమ్‌ఇండియాదే పైచేయి. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం అదెప్పుడూ మనకు ప్రియమైన శత్రువే! కీలక మ్యాచుల్లో భారత్‌ను ఓడించి కొరకరాని కొయ్యగా మారుతోంది. 2003 ప్రపంచకప్‌లో 7 వికెట్లు, 2007 టీ20 ప్రపంచకప్‌లో 10 పరుగులు, 2016 టీ20 ప్రపంచకప్‌లో 47 పరుగులు, 2019 వన్డే ప్రపంచకప్ సెమీసులో 18 పరుగులు, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 8 వికెట్లు, 2021 టీ20 ప్రపంచకప్‌లో 8 వికెట్ల తేడాతో ఆ జట్టు భారత్‌ను చిత్తు చేసింది.
అఫ్గాన్ దయ
ఆదివారం నాటి మ్యాచ్ ఫలితంలో టీమ్‌ఇండియా దాదాపుగా సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది. అయితే సాంకేతికంగా కొన్ని సమీకరణాలు మారితే అవకాశం దొరకొచ్చు. అందుకు దాదాపుగా మనం అఫ్గానిస్థాన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన జట్టు కన్నా మనం అఫ్గాన్ ప్రదర్శననే నమ్ముకోవాలి! అన్నిటికన్నా ముందు ఆ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలి. ఆ ఒక్కటీ జరిగితేనే మిగతా వాటి గురించి ఆలోచించొచ్చు. ఆ సమీకరణాలు ఏంటంటే..?
ఇలా జరగాలి
* స్కాట్లాండ్, నమీబియాను భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఓడించాయని అనుకుందాం.
* అదే జరిగితే పాక్ 10 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. సెమీస్‌కు చేరుకుంటుంది.
* మిగిలిన స్థానం కోసం ఇండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ కొట్టుకుంటాయి!
* అఫ్గాన్ చేతిలో టీమ్‌ఇండియా ఓడిందంటే మనం ఏమాత్రం ఆలోచించడానికి లేదు. కివీస్, అఫ్గాన్ సెమీస్ స్ఫాట్ కోసం ఢీకొంటాయి.
* నమీబియా, స్కాట్లాండ్, అఫ్గాన్‌ను టీమ్‌ఇండియా ఓడిస్తే 6 పాయింట్లు వస్తాయి. కానీ కివీస్‌ను తర్వాతి మ్యాచులో అఫ్గాన్ ఓడించాలి.
* కివీస్‌ను అఫ్గాన్, అఫ్గాన్‌ను ఇండియా ఓడిస్తే మూడు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉంటాయి.
* ఇప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం అవుతుంది. అందుకే నమీబియా, స్కాట్లాండ్‌పై టీమ్‌ఇండియా ఊహించనంత భారీ తేడాతో గెలవాలి.
Also Read: T20 WC 2021: దుబాయ్ వెండితెరపై..! ఫస్టాఫ్ ఫట్టు.. సెకండాఫ్ సూపర్‌హిట్టు! పాత్రధారులు మారారంతే!
Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!
Also Read: ABP LIVE Exclusive: షమీపై మతపరమైన దాడి..! ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్న కోహ్లీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)