PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ
కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది శంకరాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. కేదార్‌నాథ్ ఆలయాన్ని నేడు సందర్శించారు. ప్రధాని అయిన తర్వాత మోదీ.. కేదార్‌నాథ్ రావడం ఇది ఐదోసారి. ప్రధాని కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#WATCH Prime Minister Narendra Modi performs 'aarti' at Kedarnath temple in Uttarakhand pic.twitter.com/V6Xx7VzjY4
— ANI (@ANI) November 5, 2021
కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేదార్‌నాథుడికి ప్రధాని మోదీ తేనె, నెయ్యి, బిల్వపత్రాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం హారతి ఇచ్చారు.
గోరఖ్‌పుర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లైవ్‌లో వీక్షించారు. ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణను దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, 4 శంకరాచార్య మఠాలతోపాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం రూ. 400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.
ఆది శంకరాచార్య విగ్రహం..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. 12 అడుగుల పొడవు, 35 టన్నుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పునర్నిర్మించిన శంకరాచార్యుని సమాధిని కూడా మోదీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఇది దెబ్బతింది.
There was a time when spirituality and religion were believed to be associated only with stereotypes. But, Indian philosophy talks about human welfare, sees life in a holistic manner. Adi Shankaracharya worked to make the society aware about this truth: PM Modi at Kedarnath pic.twitter.com/qhozsmNnn9
— ANI (@ANI) November 5, 2021
ప్రధానికి స్వాగతం..
Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు
Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
ఇట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి