G20, COP26 Protocols: భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్
PM Modi: పెద్ద సదస్సులు అంటే ఎంత ముఖ్యమైనవో, అంతే సున్నితమైన అంశాలు అందులో ముడిపడి ఉంటాయి. ఈ సదస్సులలో దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రతినిధుల బృందానికి ప్రత్యేక ప్రోటోకాల్స్ అమలుచేశారు.
![G20, COP26 Protocols: భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్ G20, COP26 2021 saw special protocols PM Narendra Modi know details G20, COP26 Protocols: భారత ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం.. కీలక సదస్సులలో దేశ ప్రతినిధులకు సైతం స్పెషల్ ప్రోటోకాల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/f5f71bff6a7de22938be8e2a4a8ac83b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
G20, COP26 Protocols: భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ నెలలో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జరిగే సమావేశంలో భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. వీటి అనంతరం మరో రెండు మేజర్ ఈవెంట్లలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ20, కాప్ 20 క్లైమేట్ ఛేంజ్ సదస్సులకు హాజరయ్యారు. ప్రపంచ జీడీపీలో 80 శాతానికి పైగా వాటా 20 దేశాలదే. ఈ దేశాల సదస్సునే జీ20గా వ్యవహరిస్తారు.
పెద్ద సదస్సులు అంటే ఎంత ముఖ్యమైనవో, అంతే సున్నితమైన అంశాలు అందులో ముడిపడి ఉంటాయి. ఇటలీ, యూకేలు జీ20, గ్లాస్గో కాప్ 20 క్లైమేట్ సమ్మిట్‌కు వేదికగా మారాయి. అయితే పలు దేశాల నుంచి ప్రముఖులు, ప్రధానులు, ఛాన్స్‌లర్, అధ్యక్షులు లాంటి నేతలు హాజరుకానున్న ఈ సదస్సులలో దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రతినిధుల బృందానికి ప్రత్యేక ప్రోటోకాల్స్ అమలుచేశారు. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగి, ప్రోటోకాల్స్‌ను అధికారులు తప్పనిసరిగా పాటించారు.
Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!
ప్రధానిగా ఏడేళ్లకు పైగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోదీ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కనుక సదస్సులలో పాల్గొనేందుకు తమ దేశానికి విచ్చేసిన భారత ప్రధాని మోదీతో పాటు ఆయన టీమ్ కు సైతం హోటల్ నుంచి వేదికల వరకు వెళ్లడం లాంటి పూర్తి పర్యటనలో స్పెషల్ ప్రోటోకాల్ అమలు చేయాలని ఇటలీ, యూకేలు భావించాయి. మోదీ బస చేసే హోటల్‌లోనే ఆయన వెంట వెళ్లే అధికారులకు సైతం ఏర్పాట్లు చేయడం అందుకు నిదర్శనం. కరోనా తరువాత అధినేతలకు మాత్రమే సులువుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ భారత్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభపరిణామమే. రోమ్, గ్లాస్గోలలో ప్రధాని మోదీ బస చేసే హోటల్స్‌లోనే మన అధికారుల టీమ్‌కు వసతి ఏర్పాటు చేయడం మోదీ మార్క్‌ను సూచిస్తుంది.
Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి
అదే సమయంలో భారత ప్రధాని మోదీ ఇతర దేశాల అధినేతలతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. జీ20, కాప్ 20 సదస్సుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు 15 దేశాల అధినేతలతో ద్వైపాక్షిక భేటీలలో పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రోమ్‌లో జర్మనీ అధినేత్రి ఏంజెలా మోర్కెల్, నేపాల్ నూతన ప్రధాని షేర్ బహదుర్ డుబా, గ్లాస్గోలో ఇజ్రాయెల్ పీఎం నెఫ్టాలీ బెన్నెట్, యూకే పీఎం బోరిస్ జాన్సన్ సహ పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలలో కీలక అంశాలపై చర్చించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)