అన్వేషించండి

ఎలక్టోరల్ బాండ్స్‌ కొత్త డేటా విడుదల చేసిన ఈసీ - ఏమేం వివరాలున్నాయంటే?

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించిన కొత్త డేటాని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Electoral Bonds Fresh Data: ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన వివరాల్ని వెలువరించింది. ఇప్పటికే సీల్డ్‌ కవర్స్‌లో వీటిని సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఇవి 2019 ఏప్రిల్ 12వ తేదీ కన్నా ముందు వివరాలు అని తెలుస్తోంది. ఆ తరవాతి ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించిన వివరాల్ని గత వారమే ఎన్నికల సంఘం వెల్లడించింది. అంతకు ముందు సుప్రీంకోర్టుకి సమర్పించిన ఫిజికల్ కాపీస్‌ని రిజిస్ట్రీ ఈసీకి తిరిగి ఇచ్చింది. వీటితో పాటు డిజిటలైజ్డ్ రికార్డ్‌, పెన్‌డ్రైవ్‌నీ అందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ డిజిటలైజ్డ్ డేటాని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసిన మరుసటి రోజే ఎలక్టోరల్ బాండ్స్‌ డేటాని వెలువరించడం కీలకంగా మారింది. ఈ కొత్త డాక్యుమెంట్స్‌లో బాండ్‌ల తేదీలు, డినామినేషన్‌లు, బాండ్స్‌ సంఖ్య, SBI బ్రాంచ్‌ల వివరాలు, రిసీట్ తేదీలు, జమ అయిన తేదీలు తదితర డేటా ఉంది. అయితే...ఈ బాండ్స్‌ యునిక్ నంబర్స్‌ని మాత్రం ఈసీ వెల్లడించలేదు. దీనిపై ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. SBIకి ఓ లేఖ రాసింది. బాండ్స్‌కి సంబంధించిన యునిక్ నంబర్స్‌ని ఇవ్వాలని, అలా అయితేనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోగలమని స్పష్టం చేసింది. ఇక మాయావతి నేతృత్వంలోని Bahujan Samaj Party (BSP) తమకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎలాంటి విరాళాలూ రాలేదని వెల్లడించింది. దీంతో పాటు CPI(M)కి కూడా తమకు ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించాయి. 

తమిళనాడులోని DMK పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.656.5 కోట్లు వచ్చినట్టు వెల్లడైంది. దీంతో పాటు Future Gaming సంస్థ నుంచి రూ.509 కోట్ల రూపాయిల అందినట్టు తేలింది. ఎన్నికల సంఘానికి SBI ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలనే తాము త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ గోవా యూనిట్‌కి వాస్కో డి గామాకి చెందిన కంపెనీ నుంచి రూ.30 లక్షల విరాళం అందింది. బీజేపీ త్రిపుర, వెస్ట్‌ బెంగాల్‌లోని NCP తమకు విరాళాలు అందలేదని స్పష్టం చేసింది. 2018-19 మధ్య కాలంలో BRS కి రూ.230.65 కోట్లు వచ్చాయి. కర్ణాటకలో జేడీఎస్‌కి ఇన్‌ఫోసిస్, ఎంబసీ గ్రూప్, బయోకాన్ గ్రూప్‌ల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు వచ్చాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్స్‌లో 48% మేర బీజేపీకే వచ్చాయి. ఇక కాంగ్రెస్‌కి 11% విరాళాలు అందాయి. 2018 నుంచి రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్‌వే ఉన్నాయని Association for Democratic Reforms (ADR) స్పష్టం చేసింది. అయితే...ఈ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. కేవలం తమ మోసాల్ని కప్పి పుచ్చుకునేందుకే వివరాలు వెల్లడించడానికి వెనకడుగు వేస్తోందని మండి పడుతోంది. ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టి పారేస్తోంది. 

 Also Read: PM Modi News: వ‌చ్చే ఐదేళ్ల‌లో దేశం రూపు రేఖ‌లు మారుస్తాం: ప్ర‌ధాని మోడీ ఆత్మ‌విశ్వాసం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget