Cobra in the toilet commode: టాయిలెట్ కమెడ్‌లో కోబ్రా - చూసుకోకుండా కూర్చుంటే ప్రాణం ఉండేదా ? వీడియో
Cobra: రాజస్థాన్‌లోని ఓ హోటల్‌లో టాయిలెట్ కమోడ్‌లో కోబ్రా ప్రత్యక్షం అయింది. రూమ్ తీసుకున్న కస్టమర్.. దాన్ని చూడబట్టి సరిపోయింది. నిద్రమత్తులో కూర్చుండిపోతే కాటు వేసి ఉండేది.

Cobra found in toilet commode at a hotel in Rajasthan: బైకుల్లో..కార్లలో.. షూలలో పాములు ఉంటున్నాయని వార్తలు అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా పాములు టాయిలెట్ కమోడ్స్ నుంచి కూడా బయటకు వస్తున్నాయి.
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా పుష్కర్ తీర్థక్షేత్రంలో శనివారం హోటల్‌లో రెండో అంతస్తులోని రూమ్‌లో టాయిలెట్ కమోడ్‌లో 5 అడుగుల పొడవు కలిగిన కోబ్రా బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగిన హోటల్ పుష్కర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో ఉంది. ఒక పర్యాటకుడు టాయిలెట్‌లోకి వెళ్లినప్పుడు కమోడ్‌లో పాము కదులుతున్నట్లు గమనించాడు. భయంతో వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించాడు.
సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, అజ్మీర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కు సమాచారం ఇచ్చారు. రాజస్థాన్ కోబ్రా రిస్క్యూ టీమ్ సభ్యులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. పాము టాయిలెట్ పైప్‌ల ద్వారా హోటల్‌లోకి చేరుకుని ఉండవచ్చునని వర్షాకాలంలో సీజన్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అని వారు చెబుతున్నారు. వర్షాల వల్ల నీటిలో కొట్టుకు వస్తాయని అంటున్నారు.
కోబ్రా టీమ్ సభ్యులు పామును పట్టుకున్నారు. సుమారు 45 నిమిషాల ప్రయత్నం తర్వాత పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అజ్మీర్ అడవిలో వదిలి పెట్టారు.
अजमेर जिले की तीर्थ नगरी पुष्कर में होटल की दूसरी मंजिल पर 5 फीट लंबा जहरीला कोबरा सांप दिखने से हड़कंप मच गया। कोबरा कमोड में फुंकार मारता नजर आया, जिसे देखकर पर्यटकों की सांसें थम गईं। सूचना पर राजस्थान कोबरा टीम मौके पर पहुंची और कड़ी मशक्कत के बाद सांप को पकड़कर सुरक्षित जंगल… pic.twitter.com/ajfs269uee
— ABP News (@ABPNews) September 20, 2025
అయితే పుష్కర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని.. . అరావళి పర్వతాలు, థార్ ఏడారి సమీపంలో ఉన్నందున పాములు తరచూ ఇలాంటి ప్రాంతాలకు వస్తాయని చెబుతున్నారు. 2021లోనే పుష్కర్ బాసెలి గ్రామంలో ఒక కుటుంబం ఇంటి టాయిలెట్‌లో 8 అడుగుల కోబ్రా కనిపించింది. అప్పట్లో కూడా రిస్క్యూ టీమ్ సహాయంతో పామును అడవిలో విడుదల చేశారు.
స్థానికులు, పర్యాటకులు ఈ ఘటన తర్వాత హోటల్స్‌లో, ఇళ్లలో టాయిలెట్‌లు, పైప్‌లను జాగ్రత్తగా చెక్ చేయాలని సూచించారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు. పుష్కర్ తీర్థక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది.





















