అప్పు చేసి కారు కొనడం ఆర్థికపరంగా మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే కొన్న వస్తువు విలువ తగ్గిపోతుంది. దానికి అదనంగా వడ్డీ చెల్లించాలి.
అంటే రూ. పది లక్షలు అప్పు చేసి కారు కొంటే..నాలుగేళ్లకు దాని విలువ రూ.5 లక్షలవుతుంది. కానీ కట్టాల్సింది మాత్రం రూ. 14 లక్షలు అవుతుంది.
కారు ధరకు మించి మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. 5-7 సంవత్సరాల లోన్‌లో 20-30% అదనపు ఖర్చు
లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, GST మొదలైనవి చెల్లించాలి. ఇవి మొత్తం ఖర్చును మరింత పెంచుతాయి
కారు కొన్న వెంటనే దాని మార్కెట్ విలువ 20-30% తగ్గుతుంది. EMI చెల్లిస్తున్నప్పుడు మీరు ఇంకా లోన్ చెల్లించాల్సి ఉంటుంది, కానీ కారు విక్రయించినా మీరు నష్టపోతారు.
: EMI మీ ఆదాయానికి 20-30% భాగాన్ని తీసుకుంటుంది . ఇది ఇతర అవసరాలు (ఆహారం, ఇంటి ఖర్చులు)కు డబ్బు లేకుండా చేస్తుంది. ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది.
EMIకి డబ్బు కట్టుబడిపోతే, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడుల్లో పెట్టి 11% వంటి రాబడి పొందే అవకాశం తగ్గుతుంది.
EMI సౌలభ్యం వల్ల మీరు అవసరం లేకుండా ఖరీదైన కారు కొనవచ్చు. ఇది 'EMI ట్రాప్'లా మారి, ఆదాయానికి మించి ఖర్చు చేయడానికి దారితీస్తుంది.
రు కొన్న తర్వాత ఇన్షూరెన్స్, రిపేర్స్, ఇంధనం మొదలైనవి EMIతో పాటు చెల్లించాలి. ఇవి మొత్తం ఆర్థిక పొదుపును ప్రభావితం చేస్తాయి,
డౌన్ పేమెంట్‌కు సావింగ్స్ ఉపయోగించి, EMIలు చెల్లిస్తున్నప్పుడు ఎమర్జెన్సీలకు డబ్బు లేకుండా పోతుంది. కారు ఆదాయాన్ని పెంచేది అయితే మాత్రమే అప్పు చేసి కొనాలన్నది ఆర్థిక నిపుణుల సలహా.