H1B Issue: అమెరికాకు వెంటనే వచ్చేయాలని విదేశాల్లోని H1b ఉద్యోగులకు కంపెనీల అలర్ట్ - ట్రంప్ లక్ష డాలర్ల భారం లెక్కలు ఇవే !
Trump : ట్రంప్ విధించిన H1b లక్ష డాలర్ల ఫీజు భారం ఎవరిపై పడుతుంది? కంపెనీలు ఎందుకు ఈ వీసాలు ఉన్న వారందర్నీ వెనక్కి వచ్చేయాలంటున్నాయి.

Who will bear the burden of Trump 100,000 dollers H1b fee : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ప్రోగ్రామ్‌పై కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం చేశారు. ఈ ఆర్డర్ ప్రధానంగా H1B వీసా అప్లికేషన్స్ , రెన్యూవల్స్‌కు 100,000 డాలర్లు చెల్లించాల్సిన ఏడాది ఫీజుకు సంబంధించినది. ఈ ఆర్డర్ ఇప్పటికే ఈ వీసా ఉన్నవారికి వర్తిస్తుందా .. బయట దేశాల్లో ఉన్న H1b వీసాదారులు అమెరికాకు వస్తే.. లక్ష డాలర్లు కట్టాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై వైట్ హౌస్ కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అంశాల్లో మాత్రం ఇప్పటికే స్పష్టత ఉంది.
USలో ఇప్పటికే ఉన్న H1B ఉద్యోగులు తమ వీసా స్టేటస్ ను మెయింటైన్ చేస్తే, తక్షణం ప్రభావం పడకపోవచ్చు. కానీ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నవారు రిస్క్‌లో ఉన్నారు. USకి తిరిగి ఎంటర్ అవ్వాలంటే (రీ-ఎంట్రీ), ఎంప్లాయర్ H1B పిటిషన్‌తో 100,000 డాలర్ల ఫీజు చెల్లించాలి. లేకపోతే వారి ప్రవేశాన్ని ఆపేసే అవకాశం ఉంటుంది. H1B వీసా రెన్యూవల్ , అలాగే కొత్త అప్లికేషన్స్ కు 100,000 డాలర్లు ఫీజు కట్టాల్సి. ఇది ఎంప్లాయర్ చెల్లించాలి, కానీ చాలా కంపెనీలు దీన్ని భరించలేకపోతే, వీసా రెన్యూవల్స్ ఆలస్యమవుతాయి లేదా డ్రాప్ అవుతాయి. ఫ్యూచర్‌లో ప్రివైలింగ్ వేజ్ లెవల్స్‌ను రివైజ్ చేసి, హై-స్కిల్డ్ వర్కర్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్డర్ డైరెక్ట్ చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ ,మీడియం సాలరీ H1B హోల్డర్స్‌కు ఇబ్బంది కలిగిస్తుంది.
చాలా టెక్ జయింట్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, జేపీమోర్గాన్ తమ H1B ఉద్యోగులకు ఇంటర్నల్ అలర్ట్స్ ఇచ్చాయి. USలో ఉన్నవారు బయటకు వెళ్లవద్దని.. విదేశాల్లో ఉన్నవారు త్వరగా తిరిగి వచ్చేయాలని అలర్ట్స్ జారీ చేశాయి. అమెజాన్ H1B , H4 వీసా హోల్డర్స్‌కు "తక్షణం USకి తిరిగి వచ్చేయాలి" అని సందేశం పంపింది. మైక్రోసాఫ్ట్ కూడా ట్రావెల్ ప్లాన్స్‌ను రీ-షెడ్యూల్ చేయమని చెప్పింది. కొన్ని కంపెనీలు ఫీజు భరించలేకపోతే, H1B ఉద్యోగుల్ని లేఆఫ్ చేయవచ్చు లేదా వెనక్కి పంపవచ్చు . 2025లో అమెజాన్ 10,000+ H1B వీసాలు అప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు అంత మందికి లక్ష డాలర్లు కట్టే చాన్స్ ఉండదు. అందుకే భారీగా తగ్గే అవకాశం ఉంది.
#h1bvisa Changes
— The Lie Lamaa 🏹 (@BhaktBusters) September 20, 2025
- 100k non-refundable fee (even if denied)
- Per year so the company has to pay 100k each year they employ that H1B.
- Minimum salary moving from 60k/yr to 150k/yr
- Lasts 1 year (automatically renews) pic.twitter.com/lPYTNspdyW
అయితే ఇప్పటికిప్పుడు USలో ఉన్న H1B హోల్డర్స్‌కు తక్షణం పెద్ద మార్పు లేదు.కానీ దేశం దాటి పోలేరు. విదేశాల్లో ఉన్నవారు అమెరికాకు వెళ్లడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. పీజు వల్ల కంపెనీలు H1B నియామకాలు తగ్గిస్తాయి. ఇది జాబ్ సెక్యూరిటీకి, గ్రీన్‌కార్డ్ ప్రాసెస్‌కు ప్రభావం చూపుతుంది. ఇండియన్ IT ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు.





















