Bengaluru: అందరూ క్యూలైన్లో ఉన్నారు కానీ ఆ యువతి మాత్రం పార్శిల్ తన దగ్గరకే రప్పించుకుంది- ఈ ఐడియా మీకూ వర్కవుట్ అవుతుంది !
CTR queue: బెంగళూరులో ఓ హోటల్ ముందు పెద్ద క్యూ ఉంది. కనీసం అరగంట నిలబడాలి.కానీ ఓ యువతి మాత్రం ఐదు నిమిషాల్లో పార్శిల్ తన దగ్గరకే రప్పించుకుంది.
Bengaluru woman dodges CTR queue with Zomato order right outside the restaurant: బెంగళూరులోని సీటీఆర్ రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్. అక్కడ సీట్లు కానీ .. పార్శిల్ కోసం అయినా కనీసం అర గంట సేపు క్యూలో నిల్చోవాలి. ఇలా ఓ మహిళ కూడా హోటల్ దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ పెద్ద క్యూ ఉంది. కానీ నిరాశపడలేదు. ఐదు అంటే ఐదు నిమిషాల్లో పార్శిల్ తన దగ్గరకు వచ్చేలా చేసింది. ఎలా అనుకున్నారు తన వద్ద ఉన్న ఫోన్‌లో జొమాటో ఓపెన్ చేసింది. అదే హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. హోటల్ ఎదురుగానే ఉంది కాబట్టి డెలివరీ బాయ్ కూడా అలా తీసుకుని ఇలా తీసుకు వచ్చి వచ్చాడు. ఆ పార్శిల్ తీసుకుని ఆమె చక్కాపోయింది. అక్కడ నిల్చుకుని ఆమెను గమనిస్తున్న వారంతా భలే ఐడియా అని అనుకున్నారు. తమ ఫోన్లు బయటకు తీశారు.
సీటీఆర్ హోటల్లో ఆన్ లైన్ ఆర్డర్స్ కోసం వేరే ఏర్పాటు చేశారు. డెలివరీ బాయ్స్ అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. అందుకే త్వరలో అయిపోతుంది. కానీ డైన్ ఇన్ కానీ.. స్వయంగా పార్శిల్ తీసుకెళ్లాలన్నా లేట్ అవుతుంది. తన అనుభవాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Yesterday we had a @peakbengaluru moment:
— Anubha (@artbyahbuna) December 26, 2024
- The queue was too long at CTR and we would be late for our #UiTheMovie if we had waited in the line.
- Opened Zomato, ordered BeNNe masale dosae and Kharabath to a location just outside CTR to minimise inconvenience to the driver
-… pic.twitter.com/BQTwIlRChk
ఈ ఐడియాకు చాలా మంది విభిన్నమైన స్పందనలు ఇస్తున్నారు.
But why so much hassle? Just curious, no offence. CTR Dose is no longer that of yester years. Could have walked in to any Darshni and got a decent Dose in a shorter time.
— True_light 🇮🇳 (@Truelight1947) December 26, 2024
East or West, Bengaluru and CTR are the best 🥰. This I say after having travelled across all over the country.
— Coromandel 12841 (@Coromandel12841) December 26, 2024
ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక చాలా వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండానే ఆహార అవసరాలు తీరిపోతున్నాయి. బాగా బిజీగా ఉండే హోటళ్ల నుంచి కూడా క్షణాల్లో తెప్పించుకోవచ్చు.
Also Read: బాలుడ్ని రేప్ చేసిందని కేరళలో 19 ఏళ్ల యువతి అరెస్టు - అతడికి 16 ఏళ్లు - న్యాయమేనా ?