Facts About Arpita Mukherjee: అర్పిత ముఖర్జీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? ఆమెకు అన్ని ఫ్లాట్‌లు ఎలా వచ్చాయి?
Facts About Arpita Mukherjee: ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన అర్పిత ముఖర్జీకి, కాలేజీ రోజుల నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఉండేది. ఇప్పుడామె పేరు మీద మూడు ఫ్లాట్‌లు ఉన్నాయని ఈడీ తెలిపింది.

About Arpita Mukherjee:
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ, ఎస్ఎస్‌సీ స్కామ్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి ఎవరీమె అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. పలు పూజా కార్యక్రమాల్లో మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీకి పరిచయం ఏర్పడిందని ఇప్పటికే వెల్లడైంది. అయితే ఇప్పుడు మొత్తం ఈ అవినీతి కుంభకోణం అంతా ఆమె చుట్టూనే తిరుగుతుండటం వల్ల ఆమె పేరు దేశమంతా
మారు మోగుతోంది. పైగా ఆమెకు బెంగాల్‌లో పలు చోట్ల విలాసవంతమైన ఫ్లాట్‌లు ఉండటమూ ఈడీ అధికారుల అనుమానాలను ఇంకా పెంచింది. ఇప్పటికే రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించి దాదాపు రూ.50 కోట్ల విలువైన నగదుని స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల బంగారం కూడా దొరికింది. ఈ క్రమంలోనే అర్పిత ముఖర్జీకి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
అర్పిత ముఖర్జీ గురించి ఆసక్తికర విషయాలు
1. పలు సినిమాల్లో నటించిన అర్పిత ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా రీల్స్ చేస్తుంటారు. ఈమె పేరు మీద దాదాపు మూడు ఫ్లాట్‌లున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో నగదు జప్తు చేశారు.
2. ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే...అర్పిత ముఖర్జీకి బెల్గారియాలోని క్లబ్‌టౌన్‌లో రెండు ఫ్లాట్‌లున్నాయి. వీటిలో ఓ ఇంట్లో ఇటీవలే ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఇక్కడే ఉన్న మరో ఫ్లాట్‌లో మాత్రం ఏమీ దొరకలేదు.
3. ఆమె ఫ్లాట్‌లో రూ.2 కోట్ల విలువైన గోల్డ్‌బార్స్ దొరికాయి. వీటితో పాటు భారీ మొత్తం ఫారెన్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. కలకత్తాలోని డైమండ్ సిటీలోని ఫ్లాట్‌లో ఈ విదేశీ కరెన్సీ దొరికింది.
4. నగదు, బంగారంతో పాటు ఈడీ అధికారులకు ఆమె ఇంట్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి. ఈ రికార్డులు పరిశీలిస్తే, ఎస్‌ఎస్‌సీ స్కామ్‌కు సంబంధించి ముఖ్యమైన ఆధారాలు తెలిసే అవకాశముంది.
5.2008 నుంచి 2014 వరకూ బెంగాలీ, ఒడియా సినిమాల్లో బిజీగా గడిపారు అర్పిత ముఖర్జీ. కలకత్తాలోని బెల్గోరియాలో ఓ మిడిల్ క్లాస్‌లో ఫ్యామిలీలో జన్మించారు. కాలేజీలో చదువుకునే రోజుల నుంచే మోడలింగ్‌పై ఆమెకు ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే ఆమెను సినిమాల వైపు నడిపించింది.
6. పార్థ ఛటర్దీకి చెందిన దుర్గా పూజా కమిటీలో కీలక పాత్ర పోషించారు అర్పిత ముఖర్జీ. ఈ పరిచయమే వారి మధ్య సాన్నిహిత్యం పెంచిందని చెబుతారు.
Also Read: Kim Warns South Korea US: అణు యుద్ధానికి నేను రెడీ- పెద్ద బాంబు పేల్చిన కిమ్ జోంగ్ ఉన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

