Kim Warns South Korea US: అణు యుద్ధానికి నేను రెడీ- పెద్ద బాంబు పేల్చిన కిమ్ జోంగ్ ఉన్!
Kim Warns South Korea US: అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. అమెరికాను పరోక్షంగా హెచ్చరించారు.
Kim Warns South Korea US: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అణు హెచ్చరికలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ ప్రకటించారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. కొరియా యుద్ధ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
NEW: Kim Jong Un slammed U.S.-ROK military cooperation as taking both Koreas to the “brink of war,” state media reported on Thursday.
— NK NEWS (@nknewsorg) July 28, 2022
“I reconfirm that the DPRK is fully prepared to face any military confrontation with the U.S.,” he reportedly said.https://t.co/uP2s0Cl0w7
ఢీ అంటే ఢీ
అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు. అవసరం అయితే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఏడవ సారి అణ్వాయుధాన్ని పరీక్షించనున్నట్లు వార్తల వస్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది.
ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే అత్యధిక స్థాయిలో మిస్సైళ్లను పరీక్షించింది. ఆ దేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 31 మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు.
Also Read: Rashtrapatni Row: పార్లమెంటులో స్మతి ఇరానీ X సోనియా గాంధీ- ముదిరిన వివాదం!
Also Read: Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్