News
News
X

Rashtrapatni Row: పార్లమెంటులో స్మతి ఇరానీ X సోనియా గాంధీ- ముదిరిన వివాదం!

Rashtrapatni Row: 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులో సోనియా గాంధీ, స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

Rashtrapatni Row: కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురీ చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలు భాజపాx కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేల్చుతోంది. అయితే పార్లమెంటులో భాజపా నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది

అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై అధికార పక్షం నిరసనలు చేస్తుండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ సభకు వచ్చారు. అయితే లోక్​సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లారు. ఈ వివాదంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న భాజపా నేత రమాదేవిని సోనియా గాంధీ అడిగినట్లు సమాచారం. 

అయితే అదే సమయంలో స్మృతి ఇరానీ మధ్యలో కలగజేసుకుని.. సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారట. స్మృతి ఇరానీని ముందు సోనియా పట్టించుకోలేదు. అయితే, కాసేపటికే మంత్రివైపు చూసి 'నాతో మాట్లాడొద్దు' అని సోనియా కోపంగా అన్నారట. 

" లోక్​సభలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోనియా గాంధీ.. మా పార్టీ సీనియర్​ నాయకురాలు రమా దేవి దగ్గరకు వచ్చారు. అప్పుడు మా పార్టీకే చెందిన మరికొందరు అక్కడకు వెళ్లగానే.. 'నువ్వు(స్మృతి ఇరానీ)​ నాతో మాట్లాడకు' అంటూ సోనియా గాంధీ లోక్​సభలో మా సభ్యులను బెదిరించే ధోరణితో అన్నారు.                          "
-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

స్మృతి ఇరానీ

గిరిజన, దళిత, మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రధాని మోదీ.. గిరిజనులకు అత్యుత్నత స్థాయి గౌరవం ఇస్తే.. మీరు ఇంతలా అవమానిస్తారా? అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే."

-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

Also Read: Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్

Also Read: MPs Suspended From Parliament: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు- 27కు చేరిన లిస్ట్!

Published at : 28 Jul 2022 05:05 PM (IST) Tags: BJP sonia gandhi parliament Smriti Irani Face-Off Rashtrapatni Row Congress Reacted

సంబంధిత కథనాలు

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

India's Policy and Decisions: భారత్‌ను ప్రత్యేకంగా నిలిపిన పాలసీలు ఇవే, వాటి వివరాలు ఇదిగో

India's Policy and Decisions: భారత్‌ను ప్రత్యేకంగా నిలిపిన పాలసీలు ఇవే, వాటి వివరాలు ఇదిగో

Breaking News Live Telugu Updates: గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ది కాదు: పోలీసులు

Breaking News Live Telugu Updates: గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ది కాదు: పోలీసులు

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Election For Congress Chief: కాంగ్రెస్‌ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!