అన్వేషించండి

Insomnia: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే

మానసిక, శారీరక ఆరోగ్యాలలో ఏది బాలేకపోయినా ప్రభావం పడేది నిద్రపైనే.

కొందరికి నిద్ర సరిగా పట్టదు. పడకపై చేరి గంటలు గడుస్తున్నా నిద్రదేవతా అనుగ్రహించదు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అలాగే పోషకాహార లోపం కూడా కారణం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఆహారం కూడా నిద్రను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తీసుకునే పోషకాలే రోగనిరోధక శక్తిని, జీవక్రియను, శరీరం ఎదుగుదలను, మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 తగ్గినవారికి నిద్రలేమి సమస్య వేధిస్తుంది. 

బి12 ఎందుకు ముఖ్యం?
మన శరీరంలో ఎర్రరక్తకణాలు, డీఎన్ఏ ల అభివృద్ధికి ఈ విటమిన్ చాలా అవసరం. జీర్ణశయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి కూడా బి12 చాలా ముఖ్యం. అలాగే మానసిక సమస్యలైన నిద్రలేమి, నిరాశ, డిప్రెషన్ వంటి వాటితో బి12కు సంబంధం ఉంది. శరీరంలో మెలటోనిన్ స్థాయిలను నియంత్రించే పని చేసేది విటమిన్ బి12. ఆ మెలటోనిన్ నిద్ర విధానాలను నియంత్రించే హార్మోన్. అందుకే విటమిన్ బి12 లోపిస్తే నిద్రలేమి సమస్య మొదలయ్యే అవకాశాలు ఎక్కువ. 

ఏం తినాలి?
విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలంటే మీ ఆహార మెనూలో కొన్ని ఆహారపదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. గుడ్లు, టూనా, సాల్మన్ వంటి చేపలు, చికెన్, లివర్, చీజ్, కొవ్వు తీసేసిన పాలు, పెరుగు వంటివి రోజూ తినాలి. పండ్ల ద్వారా విటమిన్ బి12 పెద్దగా చేరదు. 

ఇతర కారణాలు
విపరీతమైన ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కూడా నిద్రపట్టకపోవడానికి కారణాలుగా మారతాయి. వీటికి గురైన వ్యక్తి స్థిమితంగా ఆలోచించలేరు కూడా. కరోనా మహమ్మరికి గురైన వ్యక్తులు కూడా చాలా మంది మానసికంగా దెబ్బతిని నిద్రకు దూరమవుతున్నారు. కొందరు తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం కలిగే నిరాశ వల్ల నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget