IPhone 12: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... గిన్నెలు తోమే విమ్ సబ్బు పంపించారు, అక్కడే మరో ట్విస్టు కూడా
ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు కానీ, అమెజాన్ లో ఒకటి ఆర్డరిస్తే మరొకటి రావడం తరచూ జరుగుతోంది.
కేరళకు చెందిన నూరుల్ అమీన్ కు ఆపిల్ ఐఫోన్ అంటే ప్రాణం. ఆ ఫోన్ వాడాలన్నది అతని కల. మొత్తమ్మీద అమెజాన్ ప్రైమ్ లో రూ.70,000 విలువ చేసే ఫోన్ ను ఆర్డర్ పెట్టుకున్నారు. అది వచ్చే రోజు కోసం ఎదురుచూడసాగాడు. తీరా వచ్చాక చూస్తే ఆ ప్యాకేట్ లో ఐఫోన్ కాదు, విమ్ సబ్బు ఉంది. దాంతో ఓ అయిదు రూపాయి కాయిన్ కూడా ఉంది. అది చూసి నూరుల్ కు దిమ్మదిరిగింది. అయితే అతను తెలివిగా చేసిన ఓ పని ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడగలిగింది.
ట్విస్టేంటంటే...
డెలివరీ బాయ్ ఫోన్ తీసుకురాగానే అతడి ముందు అనబాక్సింగ్ వీడియోను చిత్రీకరించాడు నూరుల్. అందులో విమ్ సబ్బు రావడంతో నేరుగా సైబర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఫోన్ కవర్ పైన ఉన్న ఐఎమ్ఈఐ నెంబర్ను ఉపయోగించి దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడే అసలు ట్విస్టు బయటపడింది. నూరుల్ ఆర్డర్ ఇచ్చిన ఫోన్ ను అంతకుముందు నుంచే ఎవరో జార్ఖండ్ లో ఉపయోగిస్తున్నట్టు కనిపెట్టారు. నూరుల్ కు ఫోన్ ను అమ్మింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విక్రేత.
దీంతో పోలీసులు అమెజాన్ అధికారులను, విక్రేతను, జార్ఖండ్ లో ఫోను వాడుతున్న వ్యక్తిని... ఇలా ముగ్గురినీ విచారించారు. అక్టోబర్ లో ఆర్డర్ చేసిన ఫోన్ ను, సెప్టెంబర్ నుంచే ఓ వ్యక్తి వాడుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరికి తేలిందేంటంటే... ఆ ఫోన్ స్టాక్ అయిపోయినప్పటికీ విక్రేత ఇంకా అమెజాన్ లో అమ్మకపు ప్రకటన అలానే ఉంచాడు. చివరి ఫోన్ ను సెప్టెంబరులోనే ఓ వ్యక్తి కొనుక్కున్నాడు. ఇవన్నీ తెలియని నూరుల్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాడు. కానీ ఫోన్ బదులు ఎవరు విమ్ సబ్బు పెట్టి పంపించారో మాత్రం పోలీసులు చెప్పలేదు. మొత్తమ్మీద నూరుల్ కు అతను చెల్లించిన మొత్తాన్ని అమ్మకందారు నుంచి రికవరీ చేసి ఇప్పించారు పోలీసులు.
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి