అన్వేషించండి

Pregnancy Complications : అమ్మాయిలు రాత్రుళ్లు లేట్​గా పడుకుంటున్నారా? అయితే మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనట

Sleeping Issues : అమ్మాయిలకు కంటినిండా నిద్ర ఎంత అవసరమో చెప్తున్నాయి తాజా అధ్యయనాలు. తాజాగా నిర్వహించిన  ఓ అధ్యయనంలో అమ్మాయిలకు నిద్ర తక్కువ అయితే తల్లి అవ్వడం కష్టమని తేలింది. 

Pregnancy Complications with Lack of Sleep : నిద్ర ప్రతి ఒక్కరికి అవసరమైన అతి ముఖ్యమైన చర్య. ముఖ్యంగా అమ్మాయిలు కంటినిండా నిద్రపోవాలని చెప్తున్నారు నిపుణులు. తాజా అధ్యయనాలు కూడా ఆడవారి నిద్రపై అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. మగవారి కంటే ఆడవారు ఎక్కువ సేపు నిద్రపోవాలని ఓ అధ్యయనం తేలిస్తే.. ఆడవారిలో నిద్ర తక్కువైతే ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది మరో అధ్యయనం. దాని గురించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

లేట్​గా పడుకుంటే.. 

అమ్మాయిలు రాత్రుళ్లు లేట్​గా పడుకుంటే ఫ్యూచర్​లో ప్రెగ్నెన్సీ విషయంలో పెద్ద సమస్యలు వస్తాయని తెలిపింది తాజా అధ్యయనం. రీసెంట్​గా చేసిన ఓ స్టడీలో 61 శాతం ఇండియన్స్​లో రాత్రి నిద్ర తక్కువగా ఉన్నట్లు తేలింది. దాదాపు 61 శాతం మంది ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు గుర్తించారు. అయితే వీరిలో మగవారి కంటే ఆడవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలా లేట్​ నైట్ పడుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు.. అమ్మతనానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. 

అసలు కారణాలు ఇవే..

రాత్రుళ్లు అమ్మాయిల్లో నిద్రలేకపోవడానికి అత్యంత ప్రధానకారణాలు ఇవేనంటూ కొన్ని విషయాలు తెలిపారు. అధిక ఒత్తిడి, యాంగ్జైటీకి గురికావడం ఒక రీజన్ అయితే.. పని భారం ఎక్కువ అవ్వడం మరోసమస్యగా చెప్తున్నారు. ఈ రెండిటి వల్ల చాలామంది అమ్మాయిలు తమ నిద్రకు దూరమవుతున్నారని తెలిపారు నిపుణులు. 

పెరుగుతోన్న మొబైల్ వాడకం

ఇలా నిద్రకు దూరమవుతున్న సమయంలో మొబైల్​ని ఎక్కువగా వాడేస్తున్నారు. దీనివల్ల వారి నిద్ర మరింత తక్కువ అవుతుంది. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోతే.. మెదడు, గుండె సమస్యలతోపాటు ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి.. వివిధ ఆరోగ్య సమస్యలు, ప్రాణాంతక సమస్యలు పెరుగుతాయి. వాటిలో ఇన్​ఫెర్టిలిటీ సమస్య కూడా ఒకటి. 

ప్రెగ్నెన్సీ సమస్యలు

అవును నిద్ర తక్కువ కావడం వల్ల ఆడవారిలో ఇన్​ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయట. కొందరు తల్లి అనే పదానికి దూరమయ్యే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. టీనేజర్స్​లో పీరియడ్స్ సమస్యలు పెరుగుతాయట. ఇర్​రెగ్యూలర్ పీరియడ్స్, బ్లడ్ డిశ్చార్జ్ ఎక్కువ లేదా తక్కువ కావడం వంటి సమస్యలు పెరుగుతాయట. ప్రధానంగా ఇవి పీసీఓఎస్, పీసీఓడి వంటి సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు ఇవి క్రమంగా ప్రెగ్నెన్సీ సమస్యలను పెంచుతాయని తెలిపింది తాజా అధ్యయనం. 

ఫాలో అవ్వాల్సిన టిప్స్

దీనికి పరిష్కారం కావాలనుకుంటే రోజూ కచ్చితంగా 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు దూరమై.. ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆడవారే కాకుండా మగవారు కూడా నిద్ర విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచిస్తున్నారు. అయితే మహిళలు మాత్రం వివిధ కారణాలతో నిద్రకు దూరం పెట్టొద్దని.. రాత్రుళ్లు కంటినిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు.  

Also Read :పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget