నిద్ర రాకపోతే

నిద్ర రావట్లేదా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి

Published by: Geddam Vijaya Madhuri

సూపర్ ఫుడ్స్

కొన్ని సూపర్ ఫుడ్స్ రాత్రుళ్లు ప్రశాంతమైన నిద్రను అందిస్తాయట. అవేంటంటే..

బాదం

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రమోట్ చేస్తుంది.

అరటిపండ్లు

అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషయం కండరాలకు విశ్రాంతిని అందించి.. మెరుగైన నిద్రనిస్తుంది.

వాల్​నట్స్

వాల్​నట్స్​లోని మెలాటోనిన్ నిద్ర నాణ్యతను పెంచడంతో పాటు మెరుగైన నిద్రను అందిస్తుంది.

గ్రీక్ యోగర్ట్

గ్రీక్ యోగర్ట్​లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెలాటోనిన్​ను పెంచి నిద్రను ప్రమోట్ చేస్తుంది.

ఓట్​ మీల్​

ఓట్​ మీల్​ కూడా నిద్రను అందించే హార్మోన్స్​ను విడుదల చేస్తుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్​ నిద్రను ఇంప్రూవ్ చేస్తుంది. పైగా స్వీట్ క్రేవింగ్స్​కి దీనితో చెక్ పెట్టొచ్చు.

శనగలు

శనగల్లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెలాటోనిన్​ను విడుదల చేస్తుంది.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే చాలా మంచిది. (Images Source : Envato)