ఖాళీ కడుపుతో అరటిపండు తింటే మంచిదేనా? అరటి పండ్లలో శరీరానికి అవసరమైన బోలెడు పోషకాలున్నాయి. అరటిలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అరటి కీలకపాత్ర పోషిస్తుంది. అరటిలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. అరిటిని పరగడుపున తినడం మంచిదికాదంటున్నారు నిపుణులు. అరటిపండు తక్షణం శక్తిని అందించి కాసేపటి తర్వాత అలసిపోయేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల అరటిపండులోని సహజ ఆమ్లాలు జీర్ణసమస్యలకు కారణం అవుతాయి. అరటిని తినాలి అనుకుంటే ముందుగా బ్రేక్ ఫాస్ట్ చేసి తినడం మంచిదంటున్నారు నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com