తల్లిదగ్గర పాలు లేకుంటే పిల్లలకు ఫీడ్ చేయడం కష్టమవుతుంది. పిల్లలకు సరైన పోషణ అందదు.
అందుకే పాలు పట్టేందుకు కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్‌గా తీసుకోవాలంటున్నారు తల్లులు. దీనివల్ల పాల కొరత ఉండదని అంటున్నారు.
ప్రోటీన్ ఎక్కువ కలిగిన డైయిరీ ప్రొడెక్ట్స్, బీన్స్, నట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవి తల్లులకు పాల కొరత లేకుండా చేస్తాయి.
కాల్షియం బోన్స్కి చాలా మంచిది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారికి కూడా ఇది చాలా అవసరం. అందుకే దీనికి సంబంధించిన ఫుడ్‌ని డైట్లో చేర్చుకోవాలి.
పప్పులు, బీన్స్ వంటివి ఎనిమియాను దూరం చేస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారికి ఎనిమియా ఉంటే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యూలర్‌గా తీసుకుంటే న్యూట్రిషియన్స్ కూడా అందుతాయి.
విటమిన్ డి బోన్ హెల్త్‌ని పెంచడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే ఎండలో టైమ్ స్పెండ్ చేస్తే మంచిది. పాల ఉత్పత్తులు, గుడ్లు నుంచి విటమిన్ డి అందుతుంది.
విటమిన్ బి 12 డీఎన్ఏ, నరాల ఫంక్షన్‌కి చాలా మంచిది. ఇది కూడా తల్లుల్లో పాలను ప్రమోట్ చేస్తుంది. యోగర్ట్‌లలో ఇది ఎక్కువగా ఉంటుంది.
జింక్ కలిగిన ఫుడ్ తల్లుల్లు తీసుకుంటే పిల్లల్లో ఎదుగులదల బాగుటుంది. పాల ద్వారా ఇది వారికి అందుతుందని చెప్తున్నారు.
పాలిచ్చే తల్లుల్లు డీహైడ్రేట్ కాకుండా రోజుకు పది గ్లాసుల నీటిని తాగాలి. పాల ఉత్పత్తి తక్కువగా ఉంటే నీటిని క్వాంటిటీ పెంచాలి.
ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది.