బరువు పెరుగుతున్నారా? జాగ్రత్త, ఈ 5 రకాల క్యాన్సర్లు ప్రాణాలు తీయొచ్చు!
బరువు అధికంగా ఉండేవారు లేదా స్థూలకాయంతో ఉండడం వల్ల ఇది వరకు తెలిసిన దానికంటే కూడా ఐదు క్యాన్సర్లు ఎక్కువ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక పయనీరింగ్ అధ్యయనంలో తెలియజేస్తోంది.
స్లిమ్ గా, ఫిట్ గా ఉండడం అనేది ప్రస్తుతం చాలా ట్రెండ్ లో ఉన్నవిషయం. సన్నగా, నాజూకుగా ఉండడం అందమే కాదు, ఆరోగ్యకరం కూడా. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారిలో అధిక బరువు ఉన్న వ్యక్తులు 18 రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)కు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిశోధన కోసం 2.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది BMI స్థాయి.. వారి జీవిత కాలంలో ఏవిధంగా ఉంది, అది వారి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపింది వంటి వాటిని అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ద్వారా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అధిక బరువుతో ముడిపడి ఉన్న కొత్త క్యాన్సర్లలో లుకేమియా, నాన్ హడ్కిక్ లింఫోమా, అసలు పొగ తాగే అలవాటు లేని వారిలో కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, మూత్రశయ క్యాన్సర్ల వంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలిందట.
WHO ఇంటర్నేషనల్ ఎజెన్సిస్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన స్టడి కో లీడర్ డాక్టర్ హీంజ్ ఫ్రీస్లింగ్ స్థూల కాయంతో ఉన్న వారిలో క్యాన్సర్ ముప్పు కచ్చితంగా ఎక్కువే ఉంటుందని, డాక్టర్లు కూడా దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అధ్యయనం ప్రారంభించిన సమయంలో.. ఇందులో పాల్గొన్న ఎవరికీ క్యాన్సర్ లేదు. కానీ చివరికి చేరే సరికి 225,396 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కొత్తగా గుర్తించిన ఐదు క్యాన్సర్లతో సహా మొత్తం 18 రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని ఈ పరిశోధకులు నిర్ధారించారు.
క్యాన్సర్ ప్రివెన్షన్ చర్యల్లో తగిన బరువుతో ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమైందని ఈ పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయని ఇన్‌స్టిట్యుట్ డి ఇన్వెస్టిగసియో ఎన్ అటెన్సియో ప్రిమారియా డి సలట్ జోర్డి గోల్‌కు చెందిన డాక్టర్ తలితా డువార్టే-సాల్లెస్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ పయోనీర్ పరిశోధన శరీర బరువు క్యాన్సర్ కు మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
లుకేమియా, నాన్ హడ్కిన్ లింఫోమా వంటి క్యాన్సర్లు శరీర బరువు మీద ఆధార పడి ఉన్నాయని తెలిసింది కనుక.. ఇది భవిష్యత్తులో ప్రజారోగ్య పరిరక్షణలో చాలా ప్రాధాన్యం కలిగిన పరిశోధన అని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్‌కు చెందిన డాక్టర్ పనాగియోటా మిట్రో ఓ మీడియా సంస్థతో అన్నారు. చూశారుగా, బరువు పెరిగితే ఎన్ని సమస్యలో. ఈ రోజు నుంచే మీరంతా జాగ్రత్తగా ఉండండి.
Also read : Brushing at Night: రాత్రి బ్రష్ చేయడం లేదా? జాగ్రత్త, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial