X

Man Buried With Truck: వామ్మో.. అతడిని ట్రక్కుతో సహా పూడ్చిపెట్టేశారు

ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ట్రక్కుతో సహా పూడ్చిపెట్టారు. ఇదివరకు దక్షిణాఫ్రికాలో సైతం ఓ రాజకీయవేత్తను ఇదే విధంగా పూడ్చిపెట్టడం గమనార్హం.

FOLLOW US: 

సాధారణంగా అంత్యక్రియల్లో శవ పేటికలను వాడతారు. కొందరు వస్త్రాల్లో చుట్టబెట్టి ఖననం చేస్తారు. అయితే, ఆ కుటుంబికులు మాత్రం వారి ఆత్మీయుడి భౌతిక కాయాన్ని ట్రక్కుతో సహా పూడ్చిపెట్టేశారు. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు మెక్సికోలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. 

చనిపోతూ ఎవరూ ఆస్తులను తమ వెంట తీసుకుపోలేరని అంటారు. అయితే, మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్‌‌కు చెందిన డాన్ అడాన్ అరానా మాత్రం తనతోపాటు తన ట్రక్కును కూడా తీసుకెళ్లాడు. అరానా‌కు కొన్నాళ్ల కిందట.. కొడుకు ఓ ట్రక్కును కానుకగా ఇచ్చాడు. అయితే అనారోగ్య కారణాలతో అరానా ఆ ట్రక్కును ఒక్కసారి కూడా నడపలేకపోయాడు. దీంతో తాను చనిపోయిన తర్వాత ఆ ట్రక్కును కూడా తనతో పూడ్చిపెట్టాలని కోరాడు. ఈ వింత కోరిక విని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేం కోరిక.. అంత ఖరీదైన ట్రక్కుతో సహా సమాధి చేయాలా అని అడిగారు. ఇందుకు అతడు స్పందిస్తూ.. మరణానంతర జీవితంలో దాన్ని నడుపుతానని తెలిపాడు. 

మెక్సికోలో ఆఖరి క్షణాలను గడిపే వ్యక్తుల కోరికలను గౌరవిస్తారు. దీంతో అరానా కోరికను కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు. అతడి మరణం తర్వాత శ్మశానంలో భారీ గొయ్యితీసి ట్రక్కుతో సహా శవపేటికను పూడ్చిపెట్టారు. అయితే, కారుతోపాటు శవాన్ని పూడ్చిపెట్టేందుకు కుటుంబికులు అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికా రాజకీయవేత్త తిశేకేదే బఫ్టన్ పిట్సో‌ను కూడా ఈ విధంగానే పూడ్చిపెట్టారు. అతడికి ఎంతో ఇష్టమైన మెర్సిడెస్ లిమోసిన్‌ (Mercedes Limousine)లో కూర్చోబెట్టి అంత్యక్రియలు జరిపారు. అతడి శవాన్ని కారు ముందు సీటులో కూర్చోబెట్టి మరీ పూడ్చిపెట్టారు. క్రేన్‌తో పనిలేకుండా ఎనిమిది అడుగుల లోతైన గొయ్యి తవ్వారు. అనంతరం ఉపరితలం మీద నుంచి ఏటవాలుగా గోతిలోకి మార్గం చేసి కారును సమాధిలోకి తోసి పాతిపెట్టారు. 

Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Man Buried With Truck Buried With Truck Man Last Wish Mexico Man Mexico Man Buried in Truck ట్రక్కులో శవం

సంబంధిత కథనాలు

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది...  ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..

Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..

Kissing In Wedding: అరె ఏంట్రా ఇదీ! దేశీ పెళ్లిలో విదేశీ కిస్.. అతిథుల ముందే..

Kissing In Wedding: అరె ఏంట్రా ఇదీ! దేశీ పెళ్లిలో విదేశీ కిస్.. అతిథుల ముందే..

Money: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి

Money: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి

టాప్ స్టోరీస్

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Paddy Issue: కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన

Paddy Issue: కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్