అన్వేషించండి

GI Tag: మణిపురి మిరపకాయ, నారింజలకు ప్రత్యేక గుర్తింపు

మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ రకం మిరపకాయలకు, నారింజ పళ్లకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది.

మణిపూర్ లో పండే ఓ రకం మిరపకాయలకు, నారింజ పండ్లకు విశిష్టమైన జీఐ ట్యాగ్ లభించింది. ఆ రాష్ట్రంలోని ఉక్రుల్ జిల్లాలోని సిరారాకోంగ్ గ్రామంలో హతై అని పిలిచే మిరపకాయల్ని పండిస్తారు. ఎర్రటి రంగులో 9 ఇంచుల పొడవు పెరుగుతాయి ఇవి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఈ రకం మిరపకాయలు కేవలం ఇక్కడే లభిస్తాయి. వాటి పుట్టిల్లుగా ఈ గ్రామాన్నే భావిస్తారు. అందుకే వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది. 

అలాగే మణిపూర్ లోని తామెంగ్లాంగ్ జిల్లాలో పండే నారింజ పండ్లు కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ జిల్లాను ‘ద ఆరెంజ్ బౌల్ ఆఫ్ మణిపూర్’ అని పిలుస్తారు. ఈ పండ్లు మిగతా వాటితో పోలిస్తే చాలా రుచిగా, జ్యూసీగా ఉంటాయి. విటమిన్ సి ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ పండ్లకు జీఐ ట్యాగ్ లభించింది. 

ఏంటీ జీఐ ట్యాగ్? ఉపయోగాలేంటి?

భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ప్రకారం వీటిని ఇస్తారు. ఒక ప్రాంతంలో పండే లేదా తయారు చేసే ప్రత్యేక వస్తువులకు, ఉత్పత్తులకు ఈ గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇలా జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులను, గుర్తింపు పొందిన వారి అనుమతి తీసుకోకుండా ఎక్కడా ఉత్పత్తి చేయడానికి లేదా పండించడానికి వీల్లేదు. వీటికి ప్రపంచమార్కెట్లో ఆదరణ పెరుగుతుంది. చాలా సంస్థలు వీటిని అమ్మేందుకు ముందుకు వస్తాయి. 

ఇలా జీఐ ట్యాగ్ లభించడం ఆ ఉత్పత్తి తాలూకు విలువ పెరుగుతుంది. దీని ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు వీలవుతుంది. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులకు, వస్తువులకు ఈ జీఐ ట్యాగ్ లభించింది. బాస్మతి బియ్య, డార్లిలింగ్ తేయాకు, పోచంపల్లి చీరలు, కొల్హాపురి చెప్పులు, బొబ్బిలి వీణ, నిర్మల్ బొమ్మలు, మైసూరు పట్టు ఇలా... చాలా ప్రత్యేక ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపును సాధించాయి. 

Also read: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..

Also read: పోస్ట్ కోవిడ్ పరిస్థితులు గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Muscle Strain : మసిల్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? కండరాలు బెణికినప్పుడు తీసుకోవాల్సిన పూర్తి జాగ్రత్తలు ఇవే
మసిల్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? కండరాలు బెణికినప్పుడు తీసుకోవాల్సిన పూర్తి జాగ్రత్తలు ఇవే
Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
Kairi Chutney : మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Embed widget