Romance On The Moon: చంద్రుడిపై రొమాన్స్.. నాసా ట్రైనీ కామవాంఛకు రూ.158 కోట్లు నష్టం

చంద్రుడి మీద రొమాన్స్ చేయాలని కలలుగన్న నాసా ట్రైనీ ఏం చేశాడు? చంద్రుడి మీద నుంచి సేకరించిన రాళ్లు, దూళీ ఏమయ్యాయి?

FOLLOW US: 

సికుల కోరికలకు హద్దే ఉండదు. కొత్త కొత్త ప్రాంతాల్లో శృంగారంలో మునిగిపోవాలని అనుకుంటారు. ఇది కోరిక నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్- నాసా (National Aeronautics and Space Administration-NASA)లో శిక్షణ పొందేందుకు వచ్చిన ఓ ట్రైనీకి కలిగింది.  అయితే, అతడికి ఏకంగా చంద్రుడి మీద శృంగారం చేయాలనే ఆశ పుట్టింది. కానీ, అంత దూరం ప్రియురాలితో కలిసి వెళ్లి.. ఆ కోరిక తీర్చుకోవడం ఎలా? నాసా అందుకు ఒప్పుకుంటుందా అనే చాలా ప్రశ్నలు అతడి మదిలో మెదిలాయి. అది దాదాపు అసాధ్యమని భావించిన అతడికి ఓ ఐడియా వచ్చింది. ఎట్టకేలకు చంద్రుడిపై రొమాన్స్ చేయాలే కోరికను అతడు తీర్చుకున్నాడు. అతడి వల్ల నాసా దాదాపు రూ.158 కోట్లు నష్టపోయింది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.. 


థాడ్ రాబర్ట్స్ అనే యువకుడు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల నాసా లూనార్ ల్యాబ్‌లో శిక్షణ కోసం ఇంటర్న్‌గా చేరాడు. వ్యోమగామిగా శిక్షణ పొంది.. ఏదో ఒక రోజు అంగారకుడిపై అడుగు పెట్టాలనేది అతడి ఆశ. కానీ, అతడి లైంగిక కోరికలు అతడి లక్ష్యానికి అడ్డుగా మారాయి. ప్రియురాలితో చంద్రుడి మీద శృంగారంలో పాల్గోవాలనే కోరిక అతడిని దొంగలా మార్చాయి. చివరికి.. అతడు కెరీర్‌తోపాటు జీవితాన్నే కోల్పోవలసి వచ్చింది. 


అతడు పనిచేస్తున్న ల్యాబ్‌లోని చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చిన దాదాపు 101 గ్రాముల రాళ్లు, దూళిని భద్రతపరిచారని తెలుసుకున్న అతడికి మరో వింత కోరిక పుట్టింది. చంద్రుడి మీదకు వెళ్లడం సాధ్యం కాకపోయినా.. చంద్రుడి రాళ్లు దూళి మధ్యలో శృంగారం చేయాలని భావించాడు. పైగా వాటి విలువ కోట్లలో ఉంటుందని తెలుసుకుని.. ఎలాగైనా వాటిని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఈ సందర్భంగా బెల్జియంకు చెందిన ఓ శాస్త్రవేత్తను సంప్రదించాడు. ఆ రాళ్లను ఎలాగైనా ఎత్తుకొస్తానని, ఎంత మొత్తం ఇస్తావని అడిగాడు. అలా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం జరిగింది. గ్రాముకు రూ.5 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3.70 లక్షలు) చెల్లించేందుకు ఆ శాస్త్రవేత్త అంగీకరించాడు. 


థాడ్ ప్రియురాలు టిఫ్ని కూడా ఆ ల్యాబ్‌లోనే పనిచేస్తోంది. దీంతో థాడ్ తన క్రేజీ ఐడియా చెప్పాడు. ఆమె కూడా చాలా థ్రిల్‌గా ఫీలైంది. చంద్రుడి దూళిపై రోమాన్స్ అంటే చంద్రుడిపై చేసినట్లే అంటూ థాడ్‌ను మరింత ప్రోత్సాహించింది. పైగా ఆ దూళికి భారీ మొత్తంలో డబ్బు వస్తుందని తెలియడంతో ఆమె థాడ్‌ను వారించలేదు. అదే ల్యాబ్‌లో పని చేస్తున్న షే సౌర్ అనే మరో వ్యక్తితో కలిసి చోరికి ప్లాన్ చేశారు. 


నాసా జారీ చేసిన ఐడి కార్డుల ద్వారా వారు ల్యాబ్‌లోకి ప్రవేశించారు. కానీ, లాకర్‌ను తెరవడం సాధ్యం కాలేదు. దీంతో దాన్ని పెకిళించి ఎత్తుకెళ్లిపోయారు. ఓ హోటల్‌లో గది తీసుకుని లాకర్‌ను తెరిచారు. అనంతరం అందులోని చంద్రుడి రాళ్లను పొడిగా చేసి మంచంపై చెల్లిన థాడ్.. ఎట్టకేలకు తన ప్రియురాలితో కలిసి ఆ కోరిక తీర్చుకున్నాడు. ఆ ఘనకార్యానికి అతడు ‘సెక్స్ ఆన్ ది మూన్’ అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పొడిని పోగేసి బెల్జియం శాస్త్రవేత్తకు కాల్ చేశాడు. ఎక్కువ బరువు తూగితే ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో చంద్రుడి రాళ్లను థాడ్ కల్తీ చేశాడు. 


Also Read: ఈమెది ‘ఇస్మార్ట్’ బ్రెయిన్.. మహిళ మెదడులో చిప్ పెట్టిన వైద్యులు.. ప్రపంచంలోనే తొలిసారి..


రాళ్లను విక్రయించడం కోసం థాడ్.. శాస్త్రవేత్త చెప్పిన ఓ ఇటాలియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే, అక్కడే థాడ్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. థాడ్ చంద్రుడి దూళితో అక్కడికి చేరగానే ఎఫ్‌బీఐ అధికారులు వెల్‌కమ్ చెప్పారు. అతడిని అరెస్టు చేసి రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వాటిని కల్తీ చేయడం వల్ల తదుపరి పరిశోధనలకు పనికిరాకుండా పోయాయి. థాడ్ చేసిన చెత్త పని వల్ల నాసాకు రూ.157 కోట్లు విలువ చేసే చంద్రుడి దూళిని కోల్పోవలసి వచ్చింది. చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోయే ఈ ఘటన 2002 సంవత్సరం, జులైలో చోటుచేసుకుంది. ఈ కేసు విచారించిన కోర్టు థాడ్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. చేసిన తప్పుకు థాడ్ కుంగిపోయాడు. జైల్లో ఉన్నప్పుడే అతడు ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ, పిజిక్స్‌‌లో డిగ్రీలు పూర్తిచేశాడు. ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. పనిలో పనిగా తన శిష్యులకు తన తప్పును వివరించి.. నీతులు చెబుతున్నాడు.


Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Romance On The Moon NASA intern Lunar Rocks Lunar Rocks Thief చంద్రుడిపై శృంగారం

సంబంధిత కథనాలు

E-cigarettes: ఈ-సిగరెట్లు సురక్షితమనుకుంటున్నారా? అందులో కూడా కెమికల్స్ ఉన్నాయంటున్న అధ్యయనం

E-cigarettes: ఈ-సిగరెట్లు సురక్షితమనుకుంటున్నారా? అందులో కూడా కెమికల్స్ ఉన్నాయంటున్న అధ్యయనం

Good Qualities: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే

Good Qualities: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే

Angry: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు

Angry: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు

Almonds: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?

Almonds: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?

Food for Kids: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే

Food for Kids: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే

టాప్ స్టోరీస్

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!