X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Brain Implant: ఈమెది ‘ఇస్మార్ట్’ బ్రెయిన్.. మహిళ మెదడులో చిప్ పెట్టిన వైద్యులు.. ప్రపంచంలోనే తొలిసారి..

ఈమెది సాదాసీదా బ్రెయిన్ కాదు.. ఇస్మార్ట్ బ్రెయిన్. ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఆమె మెదడుకు ఎలక్ట్రికల్ వైర్లు అనుసంధానించి మరీ ఇప్లాంట్ ఏర్పాటు చేశారు.

FOLLOW US: 

మీరు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశారా? ఆ చిత్రంలో సత్యదేవ్ సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఓ కేసును చేధించే క్రమంలో చనిపోతాడు. దాంతో అతడి ప్రియురాలైన న్యూరో సైంటిస్ట్ సారా (నిధి అగర్వాల్) అరుణ్ మెదడులో నిక్షిప్తమైన రహస్యాల్ని శంకర్ (రామ్) బ్రెయిన్‌లోకి పంపిస్తుంది. అయితే, అది సినిమా కాబట్టి చూసేందుకు బాగుంటుంది. కానీ, నిజ జీవితంలో అలా జరుగుతుందా? మెదడుకు చిప్ పెట్టడం సాధ్యమేనా? అనేగా మీ సందేహం. ఒకరి జ్ఞాపకాలను మరొకరి మెదడులో నిక్షిప్తం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిప్ ఇంప్లాంట్ ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలను నయం చేయొచ్చని లండన్ వైద్యులు తెలుపుతున్నారు. 


పుర్రెకు డ్రిల్ చేసి.. కరెంటు తీగలు పెట్టడం గురించి మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇటీవల వైద్యులు.. సారా అనే 36 ఏళ్ల మహిళకు వైద్యులు అలాంటి చికిత్స అందించారు. దాదాపు చిన్న అగ్గిపెట్టె సైజు ఉండే పరికరాన్ని ఇంప్లాంట్ చేసి మెదడుకు అనుసంధించారు. చాలా ఏళ్ల నుంచి డిప్రషన్ (కుంగుబాటు)తో బాధపడుతున్న సారా మళ్లీ సాధారణ మహిళగా మార్చేందుకు చేసిన ప్రయత్నం ఇది. సారా గత కొన్నేళ్ల నుంచి తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతోంది. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎన్నో మందులు, చికిత్సలు తీసుకుంది. చివరికి యాంటీ-డిప్రెసెంట్స్, ఎలక్ట్రోకన్వయుల్సీవ్ థెరపీ కూడా ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకపోయింది. 


ఆమె సమస్యను అర్థం చేసుకున్న వైద్యులు మెదడుకు ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేయడం ద్వారా డిప్రషన్‌ను తగ్గించవచ్చని సూచించారు. మొదట్లో సారా భయాన్ని వ్యక్తం చేసినా.. డిప్రషన్‌ను భరించడం కంటే రిస్క్ చేయడమే బెటర్ అని, చికిత్స విజయవంతమైతే కుంగుబాటు నుంచి బయటపడవచ్చని భావించింది. బ్రెయిన్ ఇంప్లాంట్ సర్జరీకి అంగీకరించింది. దాదాపు రోజంతా ఈ సర్జరీ సాగుతూనే ఉంది. వైద్యులు ఆమె పుర్రెకు రంథ్రాలు చేసి, వాటి నుంచి ఎలక్ట్రికల్ వైర్లను నేరుగా ఆమె మెదడుకు కనెక్ట్ చేశారు. ఆమె పుర్రె లోపలి వైపు ఎముకకు ఒక బ్యాటరీతో పనిచేసే ఒక యూనిట్‌ను, పల్స్ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. 


Also Read: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?


ఆమెకు వైద్యం అందించిన రీసెర్చర్, డాక్టర్ కేథరీన్ స్కాంగోస్ మాట్లాడుతూ.. ‘‘మెదడులో మేము వెంట్రల్ స్ట్రియాటం అనే ప్రాంతాన్ని కొనుగొన్నాం. ఇంప్లాంట్ చేసిన యూనిట్ ఆ భాగానికి కనెక్ట్ చేశాం. అది డిప్రషన్‌ను తొలగిస్తుంది. అమిగ్డాలాలో మెదడు కార్యకలాపాల ప్రాంతాన్ని కూడా గుర్తించాం. అది డిప్రషన్ తీవ్రతను అంచనా వేస్తుంది. సారా ఆ ఇంప్లాంట్‌ను జీవితాంతం ఉంచుకోవల్సిందే. అది ఆమె మెదడు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. డిప్రషన్‌కు లోనైనప్పుడు మాత్రమే విద్యుత్ ప్రేరణ అందిస్తుంది. ఈ ప్రక్రియ ఆమెకు తెలియకుండానే జరిగిపోతుంది. ఫలితంగా ఆమె అప్రమత్తంగా, శక్తివంతంగా, సానుకూల భావనలతో డిప్రషన్‌‌కు దూరమవుతుంది’’ అని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి బ్రెయిన్ ఇంప్లాంట్ అమర్చుకున్న తొలి వ్యక్తి సారా. ఈ కేసు విజయవంతమైనా.. చాలా రిస్క్‌తో కూడుకున్న సర్జరీ కావడం వల్ల అందరికీ ఇలాంటి చికిత్స అందించడం సాధ్యం కాదని, దీనికి ప్రత్యామ్నయం ఆలోచించాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.  


Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?


Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Depression Brain Implant Brain Implant to Woman Brain Implant for Depression బ్రెయిన్ ఇంప్లాంట్

సంబంధిత కథనాలు

Ketchup: ఇంట్లో కెచప్ ఎక్కువగా వాడుతున్నారా... అయితే సమస్యలు తప్పవు

Ketchup: ఇంట్లో కెచప్ ఎక్కువగా వాడుతున్నారా... అయితే సమస్యలు తప్పవు

Cancer Check: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా

Cancer Check: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా

Early Morning Dreams: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?

Early Morning Dreams: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?

Dengue: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు

Dengue: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు

Weird: వీడు మామూలోడు కాదు, ఫోన్ మింగేసి... ఆరునెలలు బిందాస్‌గా బతికేశాడు

Weird: వీడు మామూలోడు కాదు, ఫోన్ మింగేసి... ఆరునెలలు బిందాస్‌గా బతికేశాడు

టాప్ స్టోరీస్

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!

YSRCP : రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

YSRCP :  రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ