News
News
X

Milk Fish Intestines: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?

మనం చేపలో పేగులు తీసి పక్కన పడేస్తాం. కానీ, ఆ దేశంలో చేపతోపాటు దాని పేగులను కూడా వండుకుని తినేస్తారట.

FOLLOW US: 
 
చేప తినడం ఆరోగ్యానికి మంచిదే. శరీరానికి అవసరమైన ‘ఒమెగా-3’ ఫ్యాటీ యాసిడ్స్ చేపల నుంచి లభిస్తుంది. అయితే, మనం చేపలను వండేప్పుడు దాన్ని రెండుగా చీల్చి.. పేగులు, ఇతర భాగాలను బయటకు తీసేస్తాం. వాటిని కూడా కలిపి వండితే కూర చేదుగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా పేగులను పూర్తిగా తొలగించిన తర్వాతే చేపను ముక్కలు చేసి వంటకంలో వాడతారు. అయితే, ఆ దేశంలో మాత్రం చేప పేగులను కూడా కూరలా వండుకుని తినేస్తారు. 

ఛీ.. ఇలాంటి వంటకం గురించి ఎక్కడా వినలేదంటూ చీదరించుకోవద్దు. ఎందుకంటే ఈ వంటకానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం ఈ వంటకం కోసమే ఆ దేశంలో ప్రత్యేకంగా ‘మిల్క్‌ఫిష్’ అనే చేపలను పెంచుతున్నారు. ఈ చేప పేగులు తినేందుకు చాలా బాగుంటాయట. నూడుల్స్ తరహాలో ఉండే చేప పేగులను రకరకాల వంటకాల్లో వాడేస్తున్నారు. మిల్క్ ఫిష్ పేగులతో సూప్, ఫ్రై, ఇతరాత్ర వంటకాలను తయారు చేస్తారు. ఈ పేగులు చూసేందుకు పురుగుల్లా కనిపిస్తాయి. అన్నట్లు.. ఈ చేప పేగుల వంటకం ఏ దేశంలో ప్రత్యేకమో చెప్పలేదు కదూ. ఇది చూసేయండి. 

దాదాపు అన్ని చోట్లా చేపలు, రొయ్యల చెరువులు ఉంటాయి. అయితే, దక్షిణ తైవాన్‌లో మాత్రం.. కేవలం ‘మిల్క్ ఫిష్’ను పెంచే చెరువులు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి ప్రజలకు అదే జీవనాధారం. ఆ దేశంలో పర్యటించే పర్యాటకులకు అక్కడి ఆహారం తినాలంటే పెద్ద సవాల్. ఎందుకంటే.. ఆ చేప పేగులను దాదాపు ప్రతి వంటకంలో వాడేస్తుంటారు. అయితే, అన్ని చేపల్లా ఈ చేప నిల్వ ఉండదు. ముఖ్యంగా ఈ చేపను నీటి నుంచి బయటకు తీసిన వెంటనే పేగులు తీసి వంటలో వాడేయాలి. ఫ్రిజ్‌లో పెట్టినా అవి నిల్వ ఉండవు. ఇందుకు ఆ పేగుల్లో ఉండే ఎంజైమ్స్ కారణం.

చాలా సమయాల్లో చేపలను కట్ చేసేప్పుడు వాటి పేగులను చెత్తలోకి విసిరివేస్తారు. ఎందుకంటే.. అన్ని మిల్క్ ఫిష్‌ చేపల పేగులు తినదగినవి కావు. ఆ పేగుల్లో అవి తినే ఆహారం కనిపిస్తే.. అవి వంటకు పనికిరావు. ఆ పేగులు వంటకు ఉపయోగకరంగా ఉండాలంటే, చేపలు చాలా రోజులు ఆకలితో ఉండాలి. ఆ పేగుల్లో ఉండే ఆహార వ్యర్థాలు బయటకు పోయేన్ని రోజులు ఆ చేపలు పస్తులు ఉండాల్సిందే. దీంతో చేపలను పెంచేవారు కొన్ని రోజులు ఆ చేపలకు ఆహారం పెట్టకుండా చిత్ర హింసలు పెడతారు. 

News Reels

Also Read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?

మిల్క్ ఫిష్ పేగులను వంట చేయడానికి ముందు పూర్తిగా కడగాలి. వాటి నుంచి అన్ని వ్యర్థాలను తొలగించాలి. వాటిని సూప్‌లో వేయాలంటే బాగా ఉడకబెట్టాలి. లేదా నూనెలో బాగా వేయించిన తర్వాత సూప్‌లో వేయాలి. ఈ రెండు విధానాలూ రుచికరమైనవేనని ఆహార ప్రియులు చెబుతున్నారు. అయితే, చేప పేగుల తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందనేది మాత్రం తైవాన్ ఆహార నిపుణులు చెప్పలేదు. పైగా.. ఈ చేప పేగులు మన కడుపులోకి వెళ్లిన తర్వాత అంత త్వరగా జీర్ణం కూడా కావాట. కానీ, అక్కడి ప్రజలకు అదే ఫేవరెట్. వారి శరీరం కూడా ఆ ఆహారానికే అలవాటు పడిపోయింది. 

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Oct 2021 10:02 AM (IST) Tags: Fish Dish Fish Intestines Milk Fish Taiwan Fish Dish Taiwan Food మిల్క్ ఫిష్

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam