Maintaining Weight : బరువు తగ్గిన తర్వాత దానిని మెయింటైన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Maintaining Weight after Weight Loss : బరువు తగ్గడానికేముంది.. గట్టిగా అనుకుంటే బరువు తగ్గిపోవచ్చు. అయితే బరువు తగ్గిన తర్వాత దానిని ఎలా కాపాడుకోవాలో అదే ముఖ్యమైన అంశం.
Healthy Weight After Weight Loss : గట్టిగా ప్రయత్నిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదు. అసలు కష్టమైనది ఏమైనా ఉందా అంటే.. తగ్గిన బరువును కాపాడుకోవడమే. చాలామంది చేసే తప్పు ఏంటంటే.. బరువు తగ్గడానికి ఎన్నో కష్టాలు పడి.. సరేలే బరువు తగ్గిపోయాము కదా అని రిలాక్స్ అయిపోతారు. దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలుసా? బరువు తగ్గడం అనేది అందం కోసం కాకుండా ఆరోగ్యం కోసం అనే ప్రాధన్యత ఇవ్వాలి. అప్పుడు మీరు బరువు తగ్గినా హెల్తీగా.. మళ్లీ బరువు పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.
బరువును తగ్గించుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, పీసీఓఎస్ లక్షణాలు, థైరాయిడ్ వంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి. తగ్గిన బరువును ఎక్కువ కాలం మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. అప్పటికప్పుడు తగ్గిపోయి.. ఈ ఫలితాలన్నీ పొందాలంటే జరగని పని. బరువును తగ్గినా.. ఎక్కువ కాలం దానిని కాపాడుకోగలిగినప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. ఎందుకంటే బరువు అనేది మీ ఆరోగ్యంలో పెనుమార్పులు కలిగిస్తుంది.
రెగ్యూలర్ మిస్టేక్స్
అందుకే బరువు తగ్గడానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నామో.. దానిని కాపాడుకోవడానికి అంతే ప్రాధాన్యతనివ్వాలి. అయితే బరువు తగ్గిన తర్వాత అంతే వేగంగా బరువు పెరగడానికి గల కారణాలేంటో మీరు తెలుసుకుని ఆ విషయాల్లో జాగ్రత్త పడితే చాలు. బరువు తగ్గేందుకు చాలామంది డైట్స్ ఫాలో అవుతారు. ఆ సమయంలో కేలరీలు తక్కువగా తీసుకుంటారు. అయితే బరువు తగ్గిపోయామని కొందరు డైట్స్ మానేసి రెగ్యూలర్ ఫుడ్ తీసుకుంటారు. రెగ్యూలర్ ఫుడ్ తక్కువగా తీసుకున్నా.. దానిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయనేది తెలియక చేసే మేజర్ పొరపాటు ఇది. అందుకే తెలియకుండానే బరువు పెరిగిపోవడం జరుగుతుంది.
ఆ తప్పులు అస్సలు చేయకండి..
డైట్లో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్కి చాలా దూరంగా ఉంటారు. కానీ తర్వాత దానిని మెయింటైన్ చేయకుండా క్రేవింగ్స్ ఉన్నాయని నచ్చిన ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఇది కూడా మీరు బరువు పెరిగేలా చేస్తుంది. బరువు తగ్గడం అంటే శరీరంలో కొవ్వు తగ్గినట్లు కాదు. నీటి శాతం తగ్గి కూడా చాలా మంది బరువు తగ్గుతారు. అయితే మీరు డైట్ మానేసి మళ్లీ సాధారణంగా తినడం ప్రారంభించిన తర్వాత.. నీటి బరువును త్వరగా పెరిగే అవకాశముంది. అయితే బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు సరైన మార్గంలో వెళ్లడం వల్ల కూడా బరువు పెరగరు. కొందరు ఈజీగా బరువు తగ్గాలనుకుని కొన్ని సప్లిమెంట్స్ తీసుకుని.. లేదంటే కొన్ని కఠోరమైన డైట్స్ ఫాలో అయి బరువు తగ్గుతారు. వీటివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే బరువును ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గాలి అంటున్నారు నిపుణులు.
ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
బరువు తగ్గిన తర్వాత.. దాని మెయింటైన్ చేయడం కోసం మీ డైట్లో తగినంత కూరగాయలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అతిగా తినకపోవడమే మంచిది. శరీరానికి తగినంత ప్రోటీన్ ఇవ్వడం మరచిపోకండి. చక్కెరలు, నూనెలో వేయించిన ఫుడ్స్ కంట్రోల్లో ఉంచడమే మంచిది. అతి ముఖ్యంగా శరీరానికి తగినంత నీరు అందించాలి. ఆకలి వేసినప్పుడు కాస్త నీటిని శరీరానికి అందించాలి. దీనివల్ల ఫుడ్ కాస్త తక్కువగా తీసుకుంటారు. రెగ్యూలర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా నిద్రను అస్సలు అశ్రద్ద చేయకూడదు. వారానికోసారి బరువును చెక్ చేసుకోండి. దీనివల్ల మీరు బరువును పెరుగుతున్నారో.. లేక సరిగ్గానే ఉన్నారో తెలుస్తుంది. పైగా ఒకేసారి ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.
Also Read : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్లాంటిదేనా?