Spinal Stroke in Kids : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్లాంటిదేనా?
Spinal Stroke Causes :స్పైనల్ స్ట్రోక్ పిల్లల్లో కూడా వస్తుందా? అసలు స్పైనల్ స్ట్రోక్ అంటే ఏమిటి? దేని వల్ల ఇది సంభవిస్తుంది?
Spinal Stroke Complications : వెన్నుపాములోని ఓ విభాగానికి రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు స్పైనల్ స్ట్రోక్ సంభవిస్తుంది. వెన్నుపాము కేంద్రనాడీ వ్యవస్థలో ఓ భాగం. దీనిలో మెదడు కూడా ఉంటుంది. స్పైనల్ స్ట్రోక్ సమయంలో.. అంటే వెన్నుపాములో ఓ భాగానికి రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు.. ఆ భాగానికి ఆక్సిజన్, పోషకాలు అందవు. కణజాలాలు దెబ్బతింటాయి. ఇది శరీరంలోని మిగిలిన భాగాలకు నరాల సందేశాలను పంపలేకపోవడం వంటి స్థితి కలుగుతుంది.
వెన్నుపాముకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డుపడటం, రక్తం గడ్డకట్టడం వంటి కారణాల వల్ల స్పైనల్ స్ట్రోక్స్ కలుగుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ కంటే.. స్పైనల్ స్ట్రోక్ కాస్త భిన్నంగా ఉంటుంది. బ్రెయిన్స్ట్రోక్లో మెదుడులోని కొంత భాగానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. కానీ స్పైనల్ స్ట్రోక్‌లో దాని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది.
స్పైనల్ స్ట్రోక్ లక్షణాలు ఏమిటంటే..
స్పైనల్ స్ట్రోక్ లక్షణాలు వెన్నుపాములోని ఏ భాగాన్ని ప్రభావితం చేశాయి.. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాలలో లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి స్ట్రోక్ సంభవించిన కొన్ని గంటల తర్వాత కూడా రావచ్చు. ఆకస్మిక, తీవ్రమైన మెడ లేదా వెన్నునొప్పి. కాళ్లల్లో కండరాల బలహీనత, తిమ్మిరి, జలదరింపు, పక్షవాతం, వేడి లేదా చలిని తట్టుకోలేకపోవడం వంటివి దీని లక్షణాలు.
స్పైనల్ స్ట్రోక్‌కి కారణాలు
వయసు పెరిగే కొద్దీ ధమనులు బలహీనపడతాయి. అయినప్పటికీ కొందరిలో ధమనులు బలహీనపడి అథెరోస్ల్కోరోసిస్ వస్తుంది. ఇది స్పైనల్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. వివిధ ఆరోగ్యకారణాల వల్ల కూడా ఇది వచ్చే అవకాశముంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధి, ఊబకాయం, మధుమేహం వంటి వాటివల్ల స్పైనల్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి, వ్యాయామం చేయని వారికి దీనివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
స్పైనల్ స్ట్రోక్ కాంప్లికేషన్స్
స్పైనల్ స్ట్రోక్ వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. కొందరు పూర్తిగా పక్షవాతంలోనే ఉంటారు. మూత్ర, మల విసర్జనను ఆపుకోలేని స్థితి ఏర్పడుతుంది. లైంగికంగా పనిచేయలేరు. మరికొందరిలో నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా స్పర్శను కోల్పోతాయి. దానివల్ల పుండ్లు కూడా ఏర్పడే ప్రమాదముంది. కోలుకోలేని డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదముంది.
ఇంతకీ ఇది పిల్లలకు వస్తుందా?
పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ చాలా అరుదు. అయితే కొందరి పిల్లలకు పుట్టకతోనే స్పైనల్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. వెన్నుపాముకి గాయం లేదా రక్తనాళాలాలో సమస్యలు కలిగించే, రక్తం గట్టకట్టడాన్ని ప్రభావితం చేసే లక్షణాలు పుట్టకతో వచ్చే పరిస్థితుల వల్ల సంభవిస్తాయి. అది కావెర్నస్ వైకల్యం, ధమనుల వైకల్యం, సికిల్ సెల్ అనీమియా వంటివి కలుగుతాయి. వీటిని మీరు ఎక్కువగా నవజాత శిశువుల్లోనే చూస్తారు. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో స్ట్రోక్‌కి కారణం కూడా చెప్పలేరు.
Also Read : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.